జాతీయ వార్తలు

నేటి తరం యువతకు వెంకయ్య దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, రాజకీయ నేపథ్యం, ప్రసంగాలు నేటి తరం యువతకు దిక్సూచి లాంటివని కేంద్రమంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలపై ‘‘అలుపెరగని గళం....విరామమెరుగని ప్రయాణం’’ పేరుతో వెలువడిన పుస్తకాల సంకలనంపై శుక్రవారం నాడు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, పుస్తక సహ రచయితలు పాల్కొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ ప్రతాఫ్ రూడీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ప్రతి అంశంపై స్పష్టత, అవగహన, సాధికారతతో పాటు అనర్గళంగా సమయస్ఫూర్తితో మాట్లాడే నైపుణ్యం కలిగిన వారని కొనియాడారు. వెంకయ్య పార్టీ నాయకుడిగా, కేంద్రమంత్రిగా సహచరులపై ఎటువంటి భారం పడకుండా చూసేవారని వెల్లడించారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన వెంకయ్య ఉపరాష్టప్రతి అయ్యేంత వరకు ఆయన చేసిన ప్రయాణం దేశ చరిత్రకు సాక్షిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి అత్యంత తక్కువ ఆదరణ కలిగిన జమ్మూ కాశ్మీర్‌లోనూ ఆయన స్వయంగా పాల్గొని కార్యకర్తల్ని ఉత్తేజపరిచేవారని చెప్పారు. విద్యార్థి దశలో, బిజెపి కార్యకర్తగా పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేసినప్పుడు వెంకయ్య చేసిన ప్రసంగాల సంకలనం ద్వారా ప్రజలకు చేరువ చేశారని వెల్లడించారు.

చిత్రం..శుక్రవారం ఢిల్లీలో ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుపై రచించిన పుస్తకాన్ని విడుదల చేస్తున్న విడుదల చేస్తున్న కేంద్రమంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు