జాతీయ వార్తలు

తల్లయిన పదేళ్ల బాలికకు పది లక్షల పరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: అత్యాచారానికి గురయిన పదేళ్ల బాలికకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, చండీగఢ్ పాలనాయంత్రాంగం సమాధానాలను కోరింది. అత్యాచారం కారణంగా గర్భవతి అయిన ఆ బాలిక గురువారం ఓ శిశువుకు జన్మనిచ్చింది కూడా. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శికి, చండీగఢ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా నోటీసులు జారీ చేసిన జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని బాధితురాలు చేసుకున్న అభ్యర్థనను ఇంతకుముందు వైద్య నిపుణుల సలహాపై సుప్రీంకోర్టు తోసిపుచ్చడం తెలిసిందే. బాధితురాలు గురువారం చండీగఢ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ వ్యవహారంలో కోర్టు సహాయకురాలు (అమికస్ క్యూరీ) అయిన సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ బెంచ్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా, బెంచ్ దాన్ని విచారణకు చేపట్టింది. బాధితురాలి వయసు కేవలం పదేళ్లేనని, బిడ్డ ఆలనాపాలనను ఆమె చూసుకోలేదని, అందువల్ల ఆమెకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఇందిరా జైసింగ్ కోరారు. గురువారం ఇలాంటి కేసులో గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలని కోరిన అత్యాచార బాధితురాలి అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ఆమెకు పది లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ పదేళ్ల తల్లి బిడ్డ ఆలనా పాలనా చూడడం సాధ్యం కాదని, ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి ఆర్థిక సాయమూ చెల్లించలేదని చెప్పారు. గత నెల 28న సుప్రీంకోర్టు ఈ పదేళ్ల బాలిక తన 32 వారాల(8 నెలల) గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలంటూ చేసుకొన్న అభ్యర్థనను తిరస్కరించింది. అంతకు ముందు చండీగఢ్ జిల్లా కోర్టు సైతం ఆ బాలిక గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించకపోవడంతో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం జరిగింది.