జాతీయ వార్తలు

జెడి(యు)కు రెండు మంత్రి పదవులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఎన్‌డిఏలో చేరిన జెడి(యు)కు కేంద్ర మంత్రివర్గంలో రెండు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌డిఏలో జెడి(యు) చేరే ప్రక్రియ పూర్తికావటంతో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గం విస్తరణ కార్యక్రమం చేపడతారని అంచనా వేస్తున్నారు. ఈ విస్తరణలో జె.డి(యు)కు చెందిన ఇద్దరికి క్యాబినెట్ మంత్రి పదవులు లభించటం ఖాయమని చెబుతున్నారు. నితీశ్ కుమార్ రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రివర్గంలో జెడి(యు) చేరటం గురించి నరేంద్ర మోదీ, అమిత్ షాతో చర్చించనున్నారు. మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లటం, ఎం.వెంకయ్య నాయుడు ఉపరాష్టప్రతి పదవి చేపట్టటం, ఒక మంత్రి మరణించటంతో కేంద్ర మంత్రివర్గంలో పలు శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు జెడి(యు) ఎన్‌డిఏలో చేరడంతో మోదీ మంత్రివర్గం విస్తరణపై దృష్టి సారిస్తారని అంటున్నారు.
శరద్ యాదవ్‌పై చర్య?
ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలుపుతున్న పార్టీ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌పై చర్య తీసుకునేందుకు నితీశ్ కుమార్ సిద్ధమవుతున్నారు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నెల 27న పాట్నాలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి శరద్ యాదవ్ హాజరయ్యే పక్షంలో అతనిపై చర్య తీసుకుంటారని జెడి(యు) ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి తెలిపారు. జెడి(యు) వ్యవస్థాపక స అధ్యక్షుడైన శరద్ యాదవ్ శనివారం పాట్నాకు చేరుకున్నా నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గం సమావేశానికి హాజరు కాలేదు.
నితీశ్, శరద్ యాదవ్ వర్గాల ఘర్షణ
ముఖ్యమంత్రి నివాసం ముందు నితీశ్ కుమార్, శరద్ యాదవ్ మద్దతుదారులు గొడవపడ్డారు. శనివారం పాట్నా విమానాశ్రయంనుంచి జన అదాలత్ కార్యక్రమం వేదిక అయిన ఎస్‌కె మెమోరియల్ హాలులు దాకా శరద్ యాదవ్ వెంట ద్విచక్రవాహనాల్లో వచ్చిన ఆయన మద్దతుదారులు మార్గమధ్యంలో ముఖ్యమంత్రి నివాసం ముందు ఆగి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు, బెల్ట్‌లు పట్టుకొన్న కొంతమంది ముఖ్యమంత్రి నివాసంలోకి చొరబడడానికి ప్రయత్నించినప్పుడు గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
జెడి(యు) జాతీయ కార్యవర్గ సమావేశంకోసం ముఖ్యమంత్రి నివాసం వద్ద చేరిన పార్టీ కార్యకర్తలు బైటికి వచ్చి వారిని తరిమి కొట్టారని పోలీసులు చెప్పారు. కాగా, ఆ సమయంలో సస్పెండయిన జెడి(యు) ఎంపి అలీ అన్వర్‌తో కలిసి కారులో ఉన్న శరద్ యాదవ్ ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కాగా, విషయం తెలిసి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకొన్న పాట్నా పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) మను మహరాజ్, ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి తప్పుచేసిన వారిపై చర్య తీసుకుంటామని విలేఖరులకు చెప్పారు.

చిత్రాలు..ఎన్డీఏతో చేతులు కలుపుతూ పార్టీలో నిర్ణయం తీసుకున్న అనంతరం హర్షం వ్యక్తం చేస్తున్న నితీశ్ కుమార్. *పాట్నాలో ‘జన్ అదాలత్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న శరద్ యాదవ్