జాతీయ వార్తలు

ఉత్తరాదిన వరదలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/కోల్‌కతా, ఆగస్టు 19: కొన్ని రోజులుగా అసోం, బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితి శనివారం కాస్త నెమ్మదించినప్పటికీ ఇప్పటికీ అసోంలోని 16 జిల్లాల్లో లక్షలాది ప్రజలు నానాఅవస్థలు పడుతూనే ఉన్నారు. నార్త్ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో 52 లక్షలకు పైగా జనంపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. కాగా, అసోంలో శనివారం వరదల కారణంగా మరో ముగ్గురు మృతిచెందడంతో తాజాగా సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 63కు చేరుకొంది. బెంగాల్‌లో కూడా మరోముగ్గురు మృతి చెందారు. ఈ ఏడాది అసోం రాష్ట్రంలో వరదలు రావడం ఇది మూడోసారి. ఈ మూడు వరదల్లో కలిపి మొత్తం 147 మంది చనిపోయారు. అయితే గత రెండు రోజులుగా భారీ వర్షాలు లేకపోవడంతో ఈ రాష్ట్రాల్లో వరద పరిస్థితి కాస్త మెరుగుపడింది. అసోంలోని ధేమ్‌జీ, లఖింపూర్, శోణిత్‌పూర్, బార్‌పేట, కోక్రాఝార్, ధుబ్రి, గోలాఘాట్, జర్హట్ సహా 20 జిల్లాల్లో మొత్తం 22.11 లక్షల మంది వరద తాకిడికి గురయినట్లు ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ నివేదిక వెల్లడించింది. ఒక్క మోరిగావ్, బారిపడ జిల్లాల్లోనే అయిదేసి లక్షలకుపైగా ప్రజలు వరద తాకిడికి గురయ్యారు. 13 జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో 68 వేలకు పైగా జనం తలదాచుకుని ఉన్నారు. కాగా, జోర్హట్ జిల్లాలోని నిమతి ఘాట్, ధుబ్రి పట్టణం వద్ద బ్రహ్మపుత్రా నది ఇప్పటికీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తూనే ఉంది. నాగావ్‌లోని ధరమ్‌తుల్ వద్ద కోపిలి నది, బార్‌పేటలోని రోడ్డుబ్రిడ్జి వద్ద బేకి నది కూడా ప్రమాద స్థాయికి ఎగువనే ప్రవహిస్తున్నాయి. కాజిరంగ నేషనల్ పార్క్, లాఖువా వన్యప్రాణి కేంద్రం ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా 11 కంపెనీల ఎన్‌డిఆర్‌ఎఫ్, 17 కంపెనీల పిఏసి బృందాలు భారత వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆర్మీ బృందాలతో కలిసి నిర్విరామంగా వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. శారద, ఘాఘ్రా, రాప్తి నదులు ఇప్పటికీ అనేకచోట్ల ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తూనే ఉన్నాయి.

చిత్రం..అస్సాంలోని మోరీగావ్ జిల్లా సాగోలికోట గ్రామంలో మందులను పంపిణీ చేస్తున్న ఆరోగ్య కేంద్రం సభ్యులు