జాతీయ వార్తలు

అన్నాడిఎంకె విలీనంపై రెండు రోజుల్లో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/తిరువారూర్, ఆగస్టు 19: అన్నాడిఎంకె వర్గాల విలీనంపై చర్చలు సాఫీగా సాగుతున్నాయని, ఒకటి, రెండు రోజుల్లోనే అందరూ ఎదురుచూస్తున్న విధంగా సానుకూల నిర్ణయమే వెలువడుతుందని ఈ రెండు వర్గాలకు నాయకత్వం వహిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం చెప్పారు. విలీనం త్వరలోనే జరుగుతుందన్న విశ్వాసాన్ని పన్నీర్ సెల్వం వ్యక్తం చేయగా, ఒకటి రెండు రోజుల్లోనే సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి తంజావూరు జిల్లాలోని తిరువారూర్ వచ్చిన ముఖ్యమంత్రి చెప్పారు. రెండు వర్గాలు త్వరలోనే విలీనమవుతాయన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. కాగా, విలీనం చర్చలు సాఫీగా సాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లోనే సానుకూల ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నానని అంతకు ముందు చెన్నైలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె పురచ్చి తలైవి అమ్మా వర్గం నేత పన్నీర్ సెల్వం చెప్పారు. అన్నాడిఎంకె వర్గాలు రెండూ విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన శుక్రవారం రాత్రే వెలువడుతుందని అందరూ భావించినప్పటికీ చివరి క్షణంలో అలా జరక్క పోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేబినెట్‌లో ఎక్కువ స్థానాలు కావాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోందని, అందుకే విలీనం ప్రకటన ఆలస్యం అయిందని కూడా వార్తలు వచ్చాయి, అయితే ఇంతకు ముందు ప్రకటించినట్లుగా జయలలిత మృతిపై న్యాయ విచారణ కాకుండా సిబిఐ విచారణ జరిపించాలని ఆ వర్గంలో కొందరు కోరుతుండడం కూడా విలీనం ఆలస్యానికి కారణమని అంటున్నారు. ఇదిలా ఉండగా, పార్టీలో పక్కన పెట్టిన అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టిటివి దినకర్ శనివారం చెన్నైలోని తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి చర్యలు గనుక పార్టీకి నచ్చకపోతే ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకొంటామని దినకరన్ మద్దతుదారుడు, మాజీ మంత్రి పళనియప్పన్ ఈ సందర్భంగా హెచ్చరించడం గమనార్హం.