జాతీయ వార్తలు

28 దాకా ఈశాన్య రాష్ట్రాలకు పూర్తి రైలు సర్వీసులు సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఆగస్టు 19: భారీ వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు నిలిచిపోయిన రైలు సర్వీసులు ఈ నెల 28కన్నా ముందు పునరుద్ధరించే అవకాశాలు లేకపోవడంతో నార్త్‌ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే ఈ రాష్ట్రాలకు ప్రయాణికుల రాకపోకలకు, సరకుల తరలింపునకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొంటోంది. వరద బీభత్సం ప్రభావం తమ రైల్వేపైనే ఎక్కువగా ఉందని, బిహార్‌లోని కిషన్‌గంజ్, కతిహార్, అరారియా జిల్లాల్లోని అనేకచోట్ల రైలు మార్గాలు ఇప్పటికీ దెబ్బతిని ఉన్నాయని, అయితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి పిజె శర్మ శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ అధికారుల అంచనా ప్రకారం పూర్తిస్థాయి కనెక్టివిటీ ఈ నెల 28కి ముందు పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడానికి ఈ రోజునుంచి కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడపడంతోపాటుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ధాల్‌కోలా, రాయ్‌గంజ్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు మార్గం ఇప్పటికీ వరదల కారణంగా దెబ్బతిని ఉన్నందున ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ రెండు స్టేషన్ల మధ్య బస్సు సదుపాయాన్ని పొందడం ద్వారా తదుపరి ప్రయాణాన్ని కొనసాగించవచ్చని కూడా ఆయన తెలిపారు. అలాగే ఉత్తర బెంగాల్, అసోం, మిగతా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు, నిత్యావసర వస్తులను తరలించడానికి కిషన్‌గంజ్ స్టేషన్ అందుబాటులో ఉందని కూడా ఆయన తెలిపారు.