జాతీయ వార్తలు

17 ఎక్స్‌ప్రెస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 20: నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ పరిధిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు వైపు నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఆదివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల వల్ల కిషన్‌గంజ్ - పంజిపరా రైల్వేస్టేషన్‌ల మధ్య రైలు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దుచేయగా, మరికొన్నిటిని దారిమళ్లించి నడుపుతున్నారు. ట్రైన్ నెంబర్ 12504 కామాఖ్య నుంచి బెంగళూరు కంటోనె్మంట్‌కు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 22న తాత్కాలికంగా రద్దు చేశారు. ట్రైన్ నెంబర్ 12508 గౌహతి నుంచి త్రివేండ్రం సెంట్రల్ వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను 25న రద్దుచేయగా, ట్రైన్ నెంబర్ 12510 గౌహతి నుంచి బెంగళూరు కంటోనె్మంట్‌కు వెళ్లే గౌహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 21, 22, 27 తేదీల్లో రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 12514 గౌహతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 24న రద్దుచేయగా ట్రైన్ నెంబర్ 12516 గౌహతి నుంచి త్రివేండ్రం సెంట్రల్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 23న రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 12552 కామాఖ్య నుంచి యశ్వంత్‌పూర్ వెళ్ళే కామాఖ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 23న రద్దుచేయగా, ట్రైన్ నెంబర్ 15630 గౌహతి నుంచి తాంబరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 25న రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 15906 దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 26న రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 15930 దిబ్రూగఢ్ నుంచి తాంబరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 27న రద్దుచేయగా, ట్రైన్ నెంబర్ 22502 తినుష్కయా నుంచి బెంగళూరు సిటీ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 25న రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 22612 న్యూ జల్పాయిగిరి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 25న రద్దుచేయగా, ట్రైన్ నెంబర్ 12503 బెంగళూరు సిటీ నుంచి కామాఖ్య వెళ్ళే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 25న రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 12509 బెంగళూరు సిటీ నుంచి గౌహతి వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 23, 24, 25 తేదీల్లో రద్దుచేయగా, ట్రైన్ నెంబర్ 12551 జశ్వంత్‌పూర్ నుంచి కామాఖ్య వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 26న రద్దు చేశారు. ట్రైన్ నెంబర్ 22501 బెంగళూరు సిటీ నుంచి తినుష్కయా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 22న రద్దుచేయగా, ట్రైన్ నెంబర్ 15629 తాంబరమ్ నుంచి గౌహతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 21న రద్దుచేశారు. ట్రైన్ నెంబర్ 12507 తిరువనంతపురం సెంట్రల్ నుంచి గౌహతి వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 23న రద్దుచేశారు. ఈ అసౌకర్యాన్ని ప్రయాణికులు గమనించి రైల్వే శాఖతో సహకరించాల్సిందిగా ప్రకటనలో ఆయన కోరారు.