జాతీయ వార్తలు

యుద్ధ ట్యాంకులకు క్షిపణి దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత సైన్యం తన యుద్ధ తంత్రానికి సామర్థ్యానికి మరింతగా పదును పెట్టుకుంటోంది. ఇందులో భాగంగా టి-90 యుద్ధ ట్యాంకులకు అత్యాధునికమైన మూడోతరం క్షిపణి వ్యవస్థను అమర్చే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. టి-90 యుద్ధ ట్యాంకులు మైన సైనిక వ్యవస్థలో అత్యంత కీలకమైనవన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటికి లేజర్ ఆధారంగా పనిచేసే ఇన్‌వార్ క్షిపణి వ్యవస్థను అమర్చారు. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వీటిస్థానే మూడోతరం క్షిపణి వ్యవస్థను ఈ యుద్ధ ట్యాంకులకు అమర్చాలని సైన్యం నిర్ణయించింది. ప్రస్తుత ఇన్‌వార్ వ్యవస్థ ఉపయుక్తత గరిష్ఠస్థాయికి వచ్చిందని, పరిధిలోగానే చొచ్చుకుపోయే లక్షణంలోగాని ఇవి ఇంకెంతమాత్రం ఆధునీకరించడానికి వీలులేని స్థితికి చేరుకున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టి-90 యుద్ధ ట్యాంకుల పాటవాన్ని పెంచేందుకు మూడోతరం క్షిపణి వ్యవస్థను అమర్చడం అన్నది చాలా అవసరమని తెలిపాయి. రష్యాకు చెందిన ఈ యుద్ధ ట్యాంకులు భారత సైనిక ప్రతిదాడి విషయంలో గురుతరమైన భూమికనే పోషిస్తున్నాయి. వీటికి మూడోతరం క్షిపణులను అమర్చితే మరింతగా సైనిక శక్తి పెరుగుతుందని వెల్లడించాయి. ఈ క్షిపణులను టి-90 యుద్ధ ట్యాంకుల నుంచి ప్రయోగిస్తారు. అనుకున్న స్థాయిలో శత్రు లక్ష్యాలను ఛేదించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. అలాగే గమనంలో ఉన్న స్థిరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఈ క్షిపణి వ్యవస్థ ఛేదించగలుగుతుందని తెలిపాయి. ఎత్తయిన ప్రాంతాల్లో కూడా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ఈ యుద్ధట్యాంకులకు మాడ్యులర్ ఇంజన్‌ను అమర్చే అంశంపై కూడా సైన్యం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.