జాతీయ వార్తలు

ధర్నా చౌక్‌కోసం నేడు ఢిల్లీలో నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌ను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్ పరిరక్షణ సమితి అధ్వర్వంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సోమవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఏపి భవన్‌లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సర్కార్ వ్యవహార శైలిని ప్రజాసామ్య శక్తులన్నీ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. నిరసన తెలిపే ప్రజాస్వామ్య గొంతుకను నొక్కుతున్న ప్రభుత్వ వ్యవహార శైలిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అయిదు నెలలనుంచి తెలంగాణ వ్యాప్తంగా ధర్నాచౌక్‌ను పరిరక్షించాలని కోరుతూ ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, రాస్తారోకోలు జరిపి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆయన తెలిపారు.