జాతీయ వార్తలు

సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మీ వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై కోర్టులో అభియోగాలు నమోదయిన రోజునుంచే వారిని అనర్హులిగా ప్రకటించడాన్ని అమలు చేసినట్లయితే అధికారంలో ఉండే పార్టీ దాన్ని దుర్వినియోగం చేయవచ్చన్న భయాందోళనలున్నాయని పార్లమెంటు స్థారుూ సంఘం అభిప్రాయపడింది. అందువల్ల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను పంపాలని రాజకీయ పార్టీలను న్యాయ సంస్కరణలను పరిశీలించే సందర్భంగా న్యాయ, సిబ్బంది వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ కోరింది. ‘అభియోగాల నమోదు సమయం, ఆ తర్వాత ఆటోమేటిగ్గా అనర్హులు అయ్యే ప్రక్రియను రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారంలో ఉండే పార్టీ దుర్వినియోగం చేయవచ్చన్న భయాలున్నాయి. దయచేసి దీనిపై వ్యాఖ్యానించండి’ అని కమిటీ రాజకీయ పార్టీలకు పంపిన ఓ మెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఏదయినా కోర్టు ఒక అభ్యర్థిని దోషిగా ప్రకటిస్తే అతను లేదా ఆమె నిర్దిష్టకాలం దాకా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. 2013 జూలైలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే లాలూ ప్రసాద్ లాంటి రాజకీయ నేతలను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం తెలిసిందే. కాగా, అయిదేళ్లు, అంతకు పైబడిన శిక్షలు పడే అవకాశం ఉన్న అభియోగాలు మోపబడిన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించవచ్చా అనే అంశాన్ని సుప్రీం కోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించింది. దోషులుగా ప్రకటించిన రాజకీయ నాయకులను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు రాజ్యాంగానికి వ్యతిరేకమైనవిగా ప్రకటించాలని కోరుతున్న ఆ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతోంది. దోషులుగా ప్రకటించిన రాజకీయ నాయకులను జీవితకాలం నిషేధించడంపై ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోనందుకు గత నెల ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో ఇసిని ఎవరైనా అడ్డుకుంటున్నారేమోనని వ్యాఖ్యానించింది.