జాతీయ వార్తలు

ప్రజలు మనవెంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాల్‌గఢ్ (పశ్చిమబెంగాల్), మార్చి 25: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు భయపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా పార్టీ యంత్రాంగానికి సూచించారు. ప్రజల మద్దతుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేయాలని ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘కొంతమంది బయటి నుంచి వచ్చి మిమ్మల్ని భయపెడితే, మీరు భయపడొద్దు. మూడు రోజుల తరువాత వారు తిరిగి వెళ్లిపోతారు. మీరు ప్రజల మద్దతుతో ఎన్నికల పని చేయండి’ అని ఆమె గతంలో మావోయిస్టుల హింస పెచ్చరిల్లిన జంగల్‌మహల్ ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ అన్నారు. పార్టీ కార్యకర్తల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి ఆమె ప్రయత్నిస్తూ, ‘నేను చనిపోలేదు. నేను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాను. తృణమూల్ కాంగ్రెస్ అంటేనే తలెత్తుకుని నిలబడటం. ప్రజలు బాగుంటేనే మనం బాగున్నట్లు భావిస్తాం’ అని అన్నారు. సిపిఎం తనకు వ్యతిరేకంగా వదంతులు వ్యాపింపచేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. 34ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో 55వేల రాజకీయ హత్యలు జరిగాయని కూడా ఆమె ఆరోపించారు. సిపిఎం చేతిలో టిఎంసి కార్యకర్తలు హతమయ్యారని పేర్కొన్నారు. అయితే బెంగాల్‌లో రాజకీయ కక్షలకు తావులేదని ఆమె అన్నారు. ‘కాంగ్రెస్, బిజెపితో కలిసి సిపిఎం చేస్తున్న దుష్ప్రచారానికి భయపడొద్దు’ అని ఆమె తన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘వారు మనల్ని ఓడించలేరు. అందుకే వారు మనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు’ అని మమత ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్‌తో రాజకీయంగా పోరాడాలని ఆమె ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. లేకుంటే ఆ దుష్ప్రచారం తిరిగి మీకే చుట్టుకుంటుందని ఆమె ప్రతిపక్షాలకు హితవు పలికారు. వచ్చే నెల 4నుంచి జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షానికి గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. గత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో యుద్ధ్భూమిగా మారిన జంగల్‌మహల్‌లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని ఆమె అన్నారు.