జాతీయ వార్తలు

చరిత్ర తిరగరాశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పులనే ఇచ్చారు. అసోంలో తొలిసారి బిజెపికి పట్టం కట్టి చరిత్రను తిరగరాశారు. పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని సాగనంపారు. కేరళలో తొలిసారిగా బిజెపి ఖాతాతెరవడం మరో కీలక పరిణామం. జయ ఇంటికేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నివ్వెరపోయేలా అన్నాడిఎంకెను మళ్లీ అధికారంలోకి తెచ్చారు. గత మూడు దశాబ్దాల రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒకే పార్టీ తమిళనాట రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. జయను ఎదుర్కొనేందుకు తమిళనాట డిఎంకె-కాంగ్రెస్ చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. ఎన్నికల తుది దశలోనే అధికారం తనదేనని ధీమాగా చెప్పిన మమత పట్లే పశ్చిమ బెంగాల్ ప్రజలు మొగ్గు చూపారు. మూడింట రెండొంతుల మెజార్టీని కట్టబెట్టి తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని అధికారం కట్టబెట్టారు. మమతను ఢీకొనేందుకు సిద్ధాంతాలను పక్కన పెట్టి జతకట్టిన కాంగ్రెస్-లెఫ్ట్ కూటమికి చుక్కెదురైంది. కేరళలో ఎల్‌డిఎఫ్‌కు అధికారాన్ని అప్పగించడం ద్వారా రాజకీయ ఒరవడినే కొనసాగించారు. సోలార్ సహా అనేక కుంభకోణాల్లో చిక్కుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్‌కు చుక్కెదురైంది. ఇటు అసోం, కేరళల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు రాజకీయంగా ఈ ఫలితాలు మరిన్ని సవాళ్లను విసిరాయి. పుదుచ్చేరిలో లభించిన విజయంతోనే ఆ పార్టీ సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.