జాతీయ వార్తలు

కేరళ కోటపై మళ్లీ ఎర్ర జెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 19: కేరళలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యుడిఎఫ్ కూటమిని చిత్తుచేసి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ఒక సారి గెలిచిన కూటమి మరోసారి గెలవకపోవడం అనే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ రాష్ట్రంలో మరోసారి పునరావృతమైంది. కాగా, ఇప్పటివరకు కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టని బిజెపి ఈ ఎన్నికల్లో ఒక స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో 140 స్థానాలున్న అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్ 91 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 46 స్థానాలకే పరిమితమైంది. బిజెపి, ఇతరులు చెరో స్థానంలో గెలుపొందారు. కాగా, వడకంచెర్రీ స్థానంలో ఫలితాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అక్కడ యుడిఎఫ్ అభ్యర్థి అనిల్ అక్కర కేవలం మూడు ఓట్ల తేడాతో గెలుపొందడమే దీనికి కారణం.
ఎల్‌డిఎఫ్ సొంతంగా 85 స్థానాలను గెలుచుకోగా, ఆ కూటమి బలపరచిన ఆరుగురు స్వతంత్రులు గెలుపొందారు. ఎల్‌డిఎఫ్‌లో గెలుపొందిన ప్రముఖుల్లో 93 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు విఎస్ అచ్యుతానందన్, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినయారి విజయన్, థామస్ ఇసాక్, ఇపి జయరాజన్, సినీనటుడు ముకేశ్ తదితరులున్నారు. బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఒ రాజగోపాల్ నేమమ్ నియోజకవర్గంలో సిపిఎం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవి శివన్ కుట్టిని 8,671 ఓట్ల తేడాతో ఓడించి రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె రాజశేఖరన్, మాజీ అధ్యక్షుడు వి మురళీధరన్, మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌లు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కేవలం 46 సీట్లు దక్కించుకుని మట్టి కరచింది. ఆ కూటమి ఐయుఎంఎల్‌కు కంచుకోట అయిన మలప్పురం జిల్లాలో 12 సీట్లు, ఎర్నాకుళంలో 9 సీట్లు గెలుచుకుంది. కాగా, రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లోను ఎల్‌డిఎఫ్ తన అధిపత్యాన్ని చాటింది. త్రిసూర్ జిల్లాలోని 13 స్థానాల్లో 12 చోట్ల, కొల్లాంలో పది చోట్ల ఆ కూటమి విజయం సాధించింది. ఎల్‌డిఎఫ్ దాడిని తట్టుకుని గెలుపొందిన వారిలో ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, బార్ ముడుపుల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన మాజీ ఆర్థిక మంత్రి కెఎం మణి ఉన్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్ ఎన్ శక్తన్, డిప్యూటీ స్పీకర్ పాలోడ్ రవి, మరో నలుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. రాష్ట్ర ప్రజలు మతతత్వ, విచ్ఛిన్నకర శక్తులను తిరస్కరించారని ఈ ఎన్నిలు నిరూపించాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు విజయన్ అన్నారు. కాగా, పార్టీ కేరళ విభాగం శుఅకవారం సమావేశమై ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు.

విజేతలు
ఊమన్ చాందీ
ఎఎం మణి
విఎస్ అచ్యుతానందన్
ఓ. రాజగోపాల్

పరాజితులు
కె రాజశేఖరన్
మురళీధరన్
శ్రీశాంత్
ఎన్ శక్తన్