జాతీయ వార్తలు

‘అమ్మ’ బ్రాండ్‌కే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 19: తమిళనాడు ప్రజలు చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల తరువాత అధికారంలో ఉన్న పార్టీకి రెండోసారి పాలించే అవకాశాన్ని అందించారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో పురచ్చితలైవి జయలలిత దరహాసం వెల్లివిరిసింది. 232 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకే 134 స్థానాలను కైవసం చేసుకుంది. అధికారంపై భారీ ఆశలు పెట్టుకున్న ఎం.కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే-కాంగ్రెస్ కూటమి 98 బెంచ్‌మార్క్ దగ్గర ఆగిపోయింది. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏదో ఒక పార్టీకి క్లీన్‌స్వీప్‌తో బంపర్ విజయాన్ని కట్టబెట్టే తమిళనాడు ఓటర్లు ఈసారి డిఎంకేకు చెప్పుకోదగిన సీట్లనిచ్చి అన్నాడిఎంకేకు బలమైన ప్రతిపక్షాన్ని తెచ్చిపెట్టారు. 2011నాటి ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైన డీ ఎంకే ఈ ఎన్నికల్లో 89 సీట్లను గెల్చుకుంది. దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 8 సీట్లు, ఇతరులు మరోసీటును గెలుచుకున్నారు. అరవికురిచి స్థానంలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 1989 తరువాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన నేతగా జయలలిత రికార్డు సృష్టించారు. చెన్నైలోని ఆర్కేపురం నియోజకవర్గం నుంచి ఆమె ఘన విజయం సాధించారు. డీ ఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి తన తిరువారూర్ నియోజక వర్గం నుంచి 65వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన కుమారుడు డీ ఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ కొలతూర్ స్థానంలో 15వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జయలలితకు వ్యతిరేకంగా డీఎండీకే నేతృత్వంలో జతకట్టిన ప్రజాసంక్షేమ కూటమి ఎన్నికల ఫలితాలలో సోదిలోకి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న డిఎండీకే అధినేత విజయకాంత్ తాను పోటీ చేసిన అలండర్‌పేట స్థానంలో మూడో స్థానానికి పడిపోయారు. ఆయనతో జతకట్టిన అన్బుమణి రాందాస్ పార్టీ పట్టాలి మక్కల్ కచ్చి, పీడబ్ల్యుఎఫ్, బీజేపీలు ఏ ఒక్క స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. అయితే అన్నాడిఎంకే, డీఎంకేలు సాధించిన ఓట్ల శాతంలో తేడా కేవలం 1.4శాతమే. అన్నాడీ ఎంకే 41.6 శాతం ఓట్లు సంపాదించుకోగా, డీ ఎంకేకు 40.2శాతం ఓట్లు వచ్చాయి. ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడులోని అన్ని జిల్లాల్లోని అన్నాడి ఎంకే కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు చెన్నైలోని డీఎంకే కార్యాలయం నిర్మానుష్యమై బోసిపోయింది.