జాతీయ వార్తలు

గొగోయ్ శకానికి చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మే 19: పదిహేనేళ్లుగా తిరుగులేని అధికారాన్ని అనుభవించిన తరుణ్‌గొగోయ్ పాలనకు అసోం ప్రజలు స్వస్తి పలికారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి మోదీ బృందానికి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారాన్ని అప్పజెప్పారు. అసోం అసెంబ్లీలోని 126 స్థానాల్లో మొత్తం బీజేపీ దాని మిత్రపక్షాలు ఏకంగా 86స్థానాల్లో విజయాన్ని నమోదు చేసి అద్భుతం సృష్టించాయి. 2011 ఎన్నికల్లో కేవలం 5 స్థానాలకే పరిమితమైన బీజేపీ అయిదేళ్లు తిరిగేసరికి సొంతంగా 60 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీలో కావలసిన మెజార్టీకి కేవలం నాలుగు స్థానాల దూరంలో ఆగింది. బీజేపీ మిత్రపక్షాలైన అసోం గణపరిషత్ 14 సీట్లు, బోడో పీపుల్స్‌ఫ్రంట్ 12సీట్లలో తన అభ్యర్థులను గెలిపించుకున్నాయి. ప్రస్తుతం ముగిసిపోతున్న అసెంబ్లీలో అధికార, ప్రధాన విపక్షాలు రెండూ కూడా తాజా ఎన్నికల్లో మట్టికరిచాయి. పదిహేనేళ్ల పాటు ఎదురులేని నేతగా అసోంను పరిపాలించిన తరుణ్‌గొగోయ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఐఐయూడిఎఫ్ 13సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ పార్టీ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఓటమిపాలు కావటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. అసోంలో ఒకవేళ హంగ్ ఏర్పడినట్లయితే కింగ్ మేకర్ కావాలనుకున్న అజ్మల్ తానే ఓటమిపాలయ్యారు. తితాబోర్ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ తన ప్రత్యర్థి, బీజేపీకి చెందిన కామాఖ్య ప్రసాద్ తస్సాపై విజయం సాధించారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి శర్వానంద్ సోనోవాల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి లోచన్ పెగుపై దాదాపు 19వేల మెజార్గీతో మజులి స్థానాన్ని గెలుచుకున్నారు. బీజేపీ మిత్రపక్షమైన అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరా, బొకాఖత్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గొగోయ్ కేబినెట్‌లో పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో దాదాపు 39.45శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 33శాతం కంటే ఎక్కువ ఓట్లను సంపాదించలేక పోయింది. అటు అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీజేపీ మిత్రపక్షాల ఓట్ల శాతం 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్లశాతం (39.45)కంటే ఎక్కువగా 42శాతం ఓట్లను సాధించింది.