జాతీయ వార్తలు

రాహుల్ బాధ్యుడు కాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో జట్టు కట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. ‘ప్రతి ఎన్నికలోనూ ప్రత్యేకమైన అంశాలు పనిచేస్తాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తరుణ్ గొగోయి లేదా ఊమెన్ చాందీ లేదా మరొకరి వ్యక్తిగత పనితీరుకు నిదర్శనంగా చూడలేము’ అని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, అధికార ప్రతినిధి ఆర్‌పిఎన్ సింగ్‌తో కలిసి ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఓటమికి దారితీసిన కారణాలను విశే్లషిస్తాం. సుహృద్భావ పూరిత వాతావరణంలో వీటిపై చర్చిస్తాం’ అని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి రాహుల్, సోనియాగాంధీ బాధ్యత వహించినట్లుగానే ఈసారి ఓటమికి రాహుల్ బాధ్యత వహించాలి కదా అనే వాదనను సుర్జేవాలా తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ అసోంలో గత 15 ఏళ్లుగా, కేరళలో గత అయిదేళ్లుగా అధికారంలో ఉంటూ సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిందని ఆయన అన్నారు.