జాతీయ వార్తలు

ప్రజా తీర్పును గౌరవిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. అస్సాం, కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని రాహుల్ అన్నారు. ‘ప్రజల తీర్పును వినమ్రంగా స్వాగతిస్తున్నాం. గెలిచిన పార్టీలకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసం పొందడానికి తాము మరింత కష్టపడి పనిచేస్తామని రాహుల్ వెల్లడించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన వెంటనే రాహుల్ ట్విట్టర్‌లో స్పందించారు. తాజా ఫలితాలు తమను నిరాశకు గురిచేశాయన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ కారణాలు, ముఖ్యంగా అస్సాంలో ఓటమిపై సమీక్షిస్తామని తెలిపారు.
ఆత్మపరిశీలన చేసుకుంటాం: సోనియా
అస్సాం, కేరళలో ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో ఇందుకు దారితీసిన పరిస్థితులపై ఆత్మపరిశీలన చేసుకుంటామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. మరింత విస్తృత స్థాయిలో అంకిత భావంతో ప్రజాసేవకు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయడానికి నడుం బిగిస్తామని వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ తాము ఎందుకు అధికారాన్ని కోల్పోయామో విశే్లషించుకోవడం ద్వారా తదుపరి తప్పిదాలకు ఆస్కారం లేకుండా దిద్దుబాటు చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలకు ఆమె అభినందనలు తెలిపారు. సుపరిపాలనకు, అభివృద్ధికి ఈ విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పాండిచ్చేరిలో తమ పార్టీకి పట్టం కట్టినందుకు అక్కడి ప్రజలను అభినందించారు. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియకు మరింత బలోపేతం చేశారన్నారు.