జాతీయ వార్తలు

అసోం సిఎం సోనోవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మే 19: అసోంలో బీజేపీ మొత్తం మీద అనుకున్నది సాధించింది. పదిహేనేళ్ల గొగోయ్ శకానికి చరమగీతం పాడి అధికారం చేజిక్కించుకోవటం కమలనాథుల శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయం వెనుక అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ఒకే ఒక్కడు శర్వానంద సోనోవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గొగోయ్ పవర్‌పై నీళ్లు చల్లిన సోనోవాల్.. తాజా ఫలితాల్లోనూ మోదీ నమ్మకాన్ని నిలబెట్టారు. గొగోయ్‌ని దెబ్బతీసిన మరో కీలక నేత హిమంత విశ్వశర్మ. 2015 ఆగస్టు వరకు తరుణ్‌గొగోయ్‌కి సన్నిహిత సహచరుడిగా ఉన్న శర్మ బీజేపీ శిబిరంలో చేరటంతో రెండు సమర్థమైన శక్తులతో ఆ పార్టీ తిరుగులేని బలాన్ని సాధించినట్లయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అసోంలో తిరుగులేని మెజార్టీతో గెలిపించిన సోనోవాల్.. గొగోయ్‌కి అప్పుడే సవాలు విసిరారు. ఏడాది తిరగకుండానే గొగోయ్ శిబిరంలో బలమైన శక్తి అయిన శర్మ బీజేపీ తీర్థం పుచ్చుకోవటంతో ఆ పార్టీ మరింత బలోపేతమైంది. అసోంలో ఓట్ల సమీకరణాలు, అధికార రాజకీయాలపై మంచి పట్టున్న శర్మ బీజేపీ విజయంలో కీలకమైన వ్యూహకర్తగా వ్యవహరించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయటంలో శర్మ వ్యూహాత్మకంగా వ్యవహరించటం బీజేపీకి బాగా లాభించింది. 2015లో తరుణ్‌గొగోయ్ తన కుమారుడు గౌరవ్‌ను రాజకీయ వారసుడిగా తెరమీదకు తీసుకురావటంతో హిమంత విశ్వశర్మకు పార్టీని వీడటం మినహా మరోమార్గం లేకపోయింది. మరోవైపు శర్వానంద్ సోనోవాల్ మోదీ చేతిలో బంగారు బాతులా మారారు. లోక్‌సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన సోనోవాల్‌ను ముందుగానే అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను చిత్తు చేశారు. అంతకుముందు ఎన్నికల్లో మాదిరిగా కాకుండా రాష్ట్రంలో ప్రాంతీయ నాయకత్వం వ్యూహం ప్రకారం వెళ్లటం మోదీ టీముకు కలిసివచ్చింది. కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువులైన అస్సాం గణపరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్‌లో పరిమిత పొత్తులు పెట్టుకోవటం కూడా బీజేపీకి లాభించింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సోనోవాల్, ఉపముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణం చేయబోతున్నారు.