జాతీయ వార్తలు

జై యువభారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: మనది యువ భారతం.. నవ భారతం.. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంతగా కార్మిక శక్తి మేటవేసిన దేశం. ఆర్థిక సూపర్ పవర్‌గా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలం. ఆకాశమే హద్దుగా నిగ్గుదేలుతున్న యువనైపుణ్యం.. అవకాశాల భారతానికి ఇక ఆకాశమే హద్దంటూ ఓ సర్వే కళ్లకు కట్టింది. 130 కోట్లు దాటిన భారత జనాభాలో 65శాతం మంది 35సంవత్సరాల లోపువారేనన్న వాస్తవం భవిత మనదేనన్న ధీమాను కలిగించేదే. యువ జనాభా తగ్గి వయసు మీరిన జనాభాతో అనేక ఆసియా దేశాలు కుంగుతున్న తరుణంలో రానున్న దశాబ్దం పాటు ఈ ఖండానికి భారతే శక్తి, యుక్తి పరంగా దిక్కంటూ తాజాగా జరిగిన ఓ సర్వే తేటతెల్లం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచి అంటున్నట్టుగా ప్రగతిలోనూ, అభివృద్ధిలోనూ మనం ఎంత మాత్రం వెనుకబడి ఉండటానికి వీల్లేదన్న వాస్తవాన్ని ఈ సర్వే నిగ్గుదేల్చింది. ముఖ్యంగా వృద్ధ జనాభా పెరిగిపోతున్న ఆసియా దేశాల కార్మికావసరాలను అన్ని రంగాల్లో సగానికి పైగా తీర్చగలిగే శక్తి భారత్‌కే ఉందని ఈ నివేదిక తెలిపింది. జనాభాలో వస్తున్న మార్పులు ఆసియాలో అధికార సమతూకాన్ని మారుస్తున్నాయని, ఆ రకంగా చూస్తే యువజన బంగారుగనిని సొంతం చేసుకున్న అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని డెలాయిట్ అనే సంస్థ అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. అత్యధిక జనాభా కలిగిన చైనాలో సగటు వయసు 35 సంవత్సరాలని, జపాన్‌లో 47 సంవత్సరాలని పేర్కొన్న ఈ సంస్థ భారత జనాభా సగటు వయసు 27.3 సంవత్సరాలుగా నిగ్గుదీయడం దేశ ఉజ్వల ప్రగతి దారులు తీసేదే. కేవలం యువ శక్తి ఉన్నత మాత్రాన సరిపోదని, రాబోయే కాలంలో తలెత్తే సరికొత్త సవాళ్లకు దీటుగా సుశిక్షిత ‘వర్క్ఫోర్స్’గా కూడా భారత్ దూసుకెళ్లే అవకాశం ఉందని ఈ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కార్మిక శక్తికంటే కూడా రానున్న పదేళ్ల కాలంలో భారత్ సంతరించుకునే కార్మిక శక్తి నిరుపమానమే అవుతుందని, విద్యాపరంగానూ, నైపుణ్యంలోనూ ఎవరికీ తీసిపోని రీతిలో సత్తాను చాటుకునే అవకాశం పుష్కలంగా ఉందని తెలిపింది. కార్మిక శక్తిలో మహిళల ప్రాముఖ్యత, ప్రాతినిధ్యం కూడా పెరిగే అవకాశం ఉండటం వల్ల యువ జనాభాతో ఆర్థిక పరమైన ప్రయోజనాలూ అపారంగా సిద్ధించే అవకాశం ఉందని సర్వే నివేదిక విశే్లషించింది.పని సామర్థ్యంతో పాటు ఎక్కువ గంటలు పనిచేసే ఆసక్తి కూడా యువ జనాభాలో ఉండటం వల్ల ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగుతుందని తెలిపింది. రానున్న కాలంలో మేటవేసుకునే అవకాశాలను భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే జాతీయ ఆర్థిక వ్యవస్థకు మేలుచేసే విధంగా యువ శక్తి నైపుణ్యానికి అన్ని కోణాల్లోనూ పదును పెట్టాల్సిన అవసరం ఉందని ఈ నివేదక తెలిపింది. అన్ని రంగాల్లోనూ యాత్రిక వినియోగం పెరగడం, రోబోటిక్స్ యుగం కూడా వేగవంతం కావడం వల్ల అప్పటి పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకుని భారత యువశక్తి నైపుణ్యాన్ని పెంపొదిస్తూనే ఉండాలని తెలిపింది. ఇవన్నీ సమకూరితే ఆర్థిక సూపర్ పవర్‌గా ఎదిగేందుకు భారత్‌కు మరింత సునాయాస పరిస్థితులు ఏర్పడతాయని, తన అవసరాలు తీర్చుకోవడంతో పాటు అనేక ఆసియా దేశాలకు కార్మిక దిక్కుగా భావిసల్ల గలుగుతుందని డియోలిట్ తెలిపింది. ప్రస్తుతం ఆసియా 365 మిలియన్లు. 2027 నాటికి వీరి సంఖ్య 520 మిలియన్లకు పెరుగుతుంది.