జాతీయ వార్తలు

సైబర్ నిఘా పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో ఆన్‌లైన్ మోసాలు, సైబర్ ఆర్థిక నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో, వాటి నియంత్రణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని హోంమం త్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సైబర్ ఆర్థిక నేరాల అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వివిధ నిఘా విభాగాల ప్రతినిధులతో సైబర్ నేరాలపై వివిధ కోణాల్లో లోతుగా చర్చించారు. సైబర్ నిఘాను మరింత పెంచేందుకు నిఘా విభాగాల ప్రతినిధులు అందించిన సూచనలు, సలహాలపట్ల హోంమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఆదేశించినట్టు హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. సైబర్ ఆర్థిక నేరాగాళ్లను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏవిధమైన ప్రణాళికలు అనుసరించాలి అన్న అంశంపై వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులతో రాజ్‌నాథ్ విస్తృతంగా సమీక్షించారు. సైబర్ నిఘా విభాగాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ, నిర్దిష్ట సమయంలో గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు నిఘా విభాగాలు మరింత సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. క్రిటికల్ సైబర్ ఫోరెన్సిక్ పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ, వీటి పర్యవేక్షణ కోసం హోంశాఖ పరిధిలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో సమర్థులైన పోలీస్, జ్యుడీషియల్, ఫోరెన్సిక్ సైంటిస్టులు, ఇతర అధికారులు, బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నవాళ్లను గుర్తించి వారి సేవలను ఉపయోగించుకోవడం కీలక కర్తవ్యంగా రాజ్‌నాథ్ సూచించారు. గత మూడేళ్లలో 1.44 లక్షల సైబర్ నేరాలు నమోదయ్యాయని చెబుతూ, సిఇఆర్‌టి లెక్కల ప్రకారం 2014లో 44,679, 2015లో 49,455, 2016లో 50,362 నేరాలు నమోదైనట్టు వివరించారు. సమీక్షా సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీబ్ గౌబా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సౌనీ, ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యా పట్నాయక్ తదితరులు హాజరయ్యారు.