జాతీయ వార్తలు

డేరాబాబా సంపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్సా, సెప్టెంబర్ 19: వందలాది ఎకరాల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని రాజసం వెలగబెట్టిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ రేప్ కేసులో జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పేరుతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన డేరాబాబా జైలులో రోజుకు 20 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన ఇరవై ఏళ్ల జైలుశిక్ష పడ్డ గుర్మీత్ సింగ్ రొహ్‌తక్‌లోని సునారియా కారాగారంలో ఉంటున్నారు. జైలు కెళ్లిన తొలి రోజుల్లో అన్నింటికీ మొరాయించిన గత్యంతరం లేకపోవడంతో కూరగాయల తోటలో పనిచేయాల్సి వచ్చింది. అందరి ఖైదీల్లాగే రోజుకు 8 గంటల పనిచేస్తున్న డేరాబాబాకు రోజుకు 20 రూపాయలు కూలీ ఇస్తున్నారు. చివరికి ఇంత బతుకూ బతికి ఇంటివెనక చనిపోయినట్టు తయారైంది డేరా బాబా జీవితం. సుమారు 800 ఎకరాల్లో తనకు నచ్చినట్టు నిర్మాణాలు సకల సౌకర్యాలతో నిర్మించుకుని గుర్మీత్ ఎంజాయ్ చేశాడు. సందర్శకుల రాకపోకలతో సిర్సాలోని డేరా ప్రాంగణం తిరునాళ్లను తలపించేంది. ఈఫిల్ టవర్, తాజ్‌మహాల్, డిస్నీలాండ్, మొగల్ దర్భార్‌లను తలదనే్న కట్టడాలు డేరా ప్రాంగణంలో కొలువుదీరాయి. డేరా ప్రాంగణంలోకి వెళ్లేముందు అదిరిపోయే ద్వారం నిర్మించుకున్నాడు. అలాగే ఓ పెద్ద గోడపై గిన్నీస్ అవార్డు గ్రహీతలకు స్వాగతం పలుకుతూ చిత్రాలు నిర్మించుకున్నాడు. లోపల ఏం జరుగుతున్నదీ తెలియకుండా సామాజిక కార్యక్రమాలు చేట్టేవాడు. మొక్కలు నాటడం, వీధులు ఊడ్చే పనులు, రక్తదాన శిబిరాలు నడిచేవి. తన సినిమాల షూటింగ్ కోసం ఏకంగా ఫిల్మ్‌సిటీనే నిర్మించుకుని, ప్రాంగణం చుట్టూ విద్యుత్ తీగలు కంచె ఏర్పాటు చేశారు. గుర్మీత్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడగానే పంచకుల, పరిసరాల్లో అతడి అనుచరులు హింసకు పాల్పడ్డారు. 38 మంది చనిపోగా, 250 మంది గాయపడ్డారు. ఫిట్‌నెస్ సెంటర్లు, థియేటర్లు, పబ్‌లలో ఉల్లాసంగా గడిపేసిన గుర్మీత్ జైలు గదిలో దిగాలుగా గడుపుతున్నాడని తోటి ఖైదీలు తెలిపారు.