జాతీయ వార్తలు

రైల్వే సిబ్బందికి తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు దసరా కానుకగా 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్‌డ్ బోనస్ ప్రకటించింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016-17 సంవత్సరం పిఎల్‌బి రైల్వే శాఖకు చెందిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు దసరాలోపు ఈ బోనస్ చెల్లిస్తారు. బోనస్ నిర్ణయం ఆర్‌పిఎఫ్, ఆర్‌పిఎస్‌ఎఫ్ ఉద్యోగులకు మాత్రం వర్తించదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వేలో పనిచేస్తున్న 12.3 లక్షలమంది ఉద్యోగులు లబ్ది పొందుతారు. బోనస్ మూలంగా రైల్వే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగటమే కాకుండా, భద్రతకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలనే నిర్ణయంతో ప్రభుత్వంపై 2,245 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. పిఎల్‌బి మూలంగా రైల్వే ఉద్యోగులకు 17,951 రూపాయల బోనస్ అధికంగా లభిస్తుంది.