జాతీయ వార్తలు

దోషులకు మరణశిక్షే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో అక్రమ మద్యం మాఫియా ఆటకట్టించడానికి మరిన్ని కటిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యల్లో భాగంగా అక్రమ మద్యం తాగి ఎవరైనా చనిపోతే అందుకు బాధ్యులైన వారికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించడానికి వీలుగా ఎక్సైజ్ చట్టంలో సవరణ తీసుకు రావాలని నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేస్తుందని బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్యక్షతన జరిగిన రాష్టమ్రంత్రివర్గ సమావేశం అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ చెప్పారు. ఢిల్లీ, గుజరాత్ తర్వాత కల్తీ మద్యం తాగడం వల్ల మరణం సంభవిస్తే అందుకు బాధ్యులైన వారికి మరణ శిక్ష విధించే రాష్ట్రం యుపియే అవుతుంది. శాసన సభ సమావేశాలు జరగనందున దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను తీసుకు వస్తామని, సమావేశాలు జరిగినప్పుడు బిల్లును ఆమోదిస్తామని ఆయన చెప్పారు. సంఘటన తీవ్రతను బట్టి బాధ్యులకు గరిష్ఠంగా మరణ శిక్ష విధించడానికి వీలుగా ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకు వస్తామని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ నేరాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించడానికి కూడా ఈ సవరణ వల్ల వీలవుతుంది, కల్తీ మద్యం తాగి ఎవరైనా మరణిస్తే మద్యం తయారీదారు, లేదా సరఫరాదారులకు జీవిత ఖైదు, పది లక్షల రూపాయల జరిమానా లేదా రెండు శిక్షలు లేదా గరిష్ఠంగా మరణ శిక్ష విధించేలా 2010 నాటి యుపి ఎక్సైజ్ చట్టంలో సవరణలు తీసుకు వస్తారు.
2011లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్తీ మద్యం మరణాల బాధ్యులకు మరణ శిక్ష విదించడానికి వీలుగా చట్టం తీసుకు వచ్చారు. ఇప్పుడు యుపి కూడా అదే బాటలో పయనించాలని అనుకొంటోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఏడాది కల్తీ మద్యం సేవించి పెద్ద సంఖ్యలో జనం చనిపోతూ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో ఆజమ్‌గఢ్‌లో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు 2015లో లక్నోలో ఇలాగే 28 మంది చనిపోయారు.