జాతీయ వార్తలు

మళ్లీ.. ఖేలో ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో క్రీడల ప్రోత్సాహకానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీనికోసం రానున్న రెండేళ్లలో 1,756 కోట్లు ఖర్చు చేస్తారు. కార్యక్రమం కింద వెయ్యిమంది యువ క్రీడాకారులకు ప్రత్యేక ఉపకార వేతనంతోపాటు దేశంలోని 20 వర్శిటీల్లో క్రీడలకు పెద్దపీట వేస్తారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, క్రీడల మంత్రి రాజ్యవర్థన్ రాథో డ్ మీడియాకు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు దేశం మొత్తం మీద వెయ్య మంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ప్రత్యేక ఉపకార వేతనం చెల్లిస్తారు. ఈ కార్యక్రమం కింద ఎంపికైన క్రీడాకారులకు ఎనిమిదేళ్లపాటు సాలీనా ఐదు లక్షల ఉపకార వేతనం చెల్లిస్తారు. దేశంలో మొదటిసారి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దీర్ఘకాల ప్రోత్సాహకాలను ప్రకటించారు. ప్రచంచస్థాయిలో జరిగే క్రీడల్లో విజయం సాధించే క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోవున్న ఇరవై వర్శిటీల్లో క్రీడలకు పెద్దపీట వేసి, వీటిని క్రీడా నైపుణ్యాన్ని వృద్ధిచేసే కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆరోగ్యవంతులైన సృజనాత్మక పౌరులను తీర్చిదిద్దటం కూడా దీని లక్ష్యమని జైట్లీ, రాథోడ్ ప్రకటించారు. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని పునర్వ్వవస్థీకరించటం ద్వారా దేశంలోని క్రీడల వాతావరణాన్ని పూర్తిగా మార్చివేయటంతోపాటు వౌలిక సదుపాయాలను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తారు. కమ్యూనిటీ స్పోర్ట్స్, టాలెంట్ ఐడెంటిఫికేషన్‌ను పెంచే శిక్షణ ఇవ్వటంతోపాటు పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తారని రాథోడ్ తెలిపారు. దీనితోపాటు 10-18 సంవత్సరాల మధ్య వయస్సున్న దాదాపు 200 మిలియన్ బాలబాలికలను ఈ పథకం పరిధిలోకి తెస్తారని ఆయన చెప్పారు. కర్యక్రమం మూలంగా ఉద్రిక్తతకు నిలయాలైన రాష్ట్రాలతోపాటు సదుపాయాలను లేని రాష్ట్రాల యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా కాపాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘అందరికీ క్రీడలు, ప్రతిభకు క్రీడలు’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని రాథోడ్ తెలిపారు.