జాతీయ వార్తలు

రైతుల ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రానున్న ఏడు సంవత్సరాల కాలంలో గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహకార సంస్థలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు ఇక్కడ పిలుపునిచ్చారు. సహకార సంస్థలు తేనెటీగల్ని పెంచడ ం, సీ వీడ్ ఫార్మింగ్ వంటి రంగాల్లోకి అడుగుపెట్టి రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెండింతలు చేయాలని కోరారు. సహకార స్ఫూర్తిని మరింత పటిష్టం చేయాలని నిరంతరం ముందుకు తీసుకువెళుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపకరించేలా తీర్చిదిద్దాలని కోరారు. మహారాష్టక్రు చెందిన సహకార సంస్థ నాయకుడు లక్ష్మణ్ మాధవరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మాట్లాడిన మోదీ భారతదేశంలో సహకార రంగం అన్నివిధాలుగా అభివృద్ధి చెందడానికి కొత్త వెలుగులు చిమ్మడానికి సహజ సిద్ధమైన అవకాశం ఉందని మోదీ తెలిపారు. అయితే కొన్ని కీలక రంగాల్లో కూడా సహకార సంస్థలు అడుగుపెడితే సానుకూలమైన ఫలితాలను, ఆర్థికపరమైన లబ్ధిని రైతులకు చేకూర్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఏడేళ్ల కాలంలో సహకారోద్యమం ద్వారా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు ఏ రకమైన అవకాశాలున్నాయన్నదానిపై సహకార సంస్థలు దృష్టి
పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. పాత పద్ధతిలో కాకుండా ఉత్తమమైన ఆలోచనలతో ఫలితాలు సాధించగలిగే విధానాలతో ముందుకు వెళ్లాలని సహకార సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామీణ భారత అవసరాలను, అభివృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను తెరపైకి తేవాలన్నారు. వృద్ధిపథంలో గ్రామీణ భారతాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళితే జాతీయ స్థాయిలో అంతగానూ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రైతులు తమ ముడిసరుకును రిటైల్ రేటుకు కొనుక్కుని ఉత్పత్తులను హోల్‌సేల్ రేటుకు అమ్ముతున్నారని, ఇదే పద్ధతిని కొనసాగించాల్సిన అవసరం ఉందా అని మోదీ ప్రశ్నించారు. తమ ముడిసరుకును రైతులు హోల్‌సేల్ ధరలకు కొని రిటైల్ రేటుకు ఉత్పత్తులను అమ్మగలిగితే ఎవరూ కూడా వారిని దోచుకునే అవకాశం ఉండదని, దళారుల ప్రమేయం లేకుండా పండించిన దానికి తగిన రేటును వారు పొందగలుగుతారని మోదీ తెలిపారు. పాడి, సహకార సంస్థలతో దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న రైతులు ఎంతగానో వృద్ధి చెందడానికి కారణం వీరు పాలను హోల్‌సేల్ ధరలకు కొని అమ్మడమేనని స్పష్టం చేశారు. పాడి రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేటు సంస్థలకు అమ్మివుంటే ఇంతగా ఆర్జించి ఉండేవారు కాదని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఈ రకమైన సహకార సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం చక్కెర, పాడి పరిశ్రమ రంగాల్లో సహకార సంస్థలు ఉన్నాయని పేర్కొన్న మోదీ ‘్భరతదేశ అవసరాలకు సహకార వ్యవస్థ అన్ని విధాలుగా సరిపోతుంది. ఈ సహకార సంస్థలు కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి గ్రామీణ ఉత్పత్తులకు మరింత ఊతాన్ని ఇవ్వాలి’ అని పిలుపునిచ్చారు.

చిత్రం..భారత సహకార ఉద్యమంపై పుస్తకం విడుదల చేస్తున్న ప్రధాని మోదీ