బిజినెస్

అమ్మకానికి లాప్లేస్, వింటన్ స్టీల్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 25: ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ ఆర్సెలార్ మిట్టల్.. అమెరికాలోని తమ లాప్లేస్, వింటన్ లాంగ్ కార్బన్ ప్లాంట్లను అమ్మేస్తోంది. అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్ డైమండ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఓ అనుబంధ సంస్థకు వీటిని ఆర్సెలార్ మిట్టల్ విక్రయిస్తున్నారు. ఈ మేరకు ఆర్సెలార్ మిట్టల్ తెలియజేసింది. అయితే ఎంతకు అమ్ముతున్నారన్న వివరాలను మాత్రం తెలియజేయలేదు.
కాగా, లగ్జంబర్గ్ ప్రధాన కేంద్రంగా పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ తమ రుణ భారాన్ని తగ్గించుకోవడానికే ఈ అమ్మకాలను చేపడుతోంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆర్సెలార్ మిట్టల్ అప్పులు 15.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీనివాస్ మిట్టల్ నేతృత్వంలోని ఆర్సెలార్ మిట్టల్.. స్టీల్ తయారీలో ప్రపంచస్థాయి దిగ్గజమవగా, చైనా పరిశ్రమ నుంచి మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున వస్తున్న ఉక్కు.. ఆర్సెలార్ మిట్టల్‌కు గట్టి పోటీనిస్తోంది.
ఈ క్రమంలో వ్యాపారంలోని ప్రతికూల పరిస్థితుల మధ్య రుణ భారాన్ని తగ్గించుకోవడానికి లాప్లేస్, వింటన్ స్టీల్ ప్లాంట్లను అమ్మేయడానికి ఆర్సెలార్ మిట్టల్ సిద్ధమైంది. ఓ నిశ్చయాత్మక లావాదేవీ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు ఆర్సెలార్ మిట్టల్ తెలిపింది. కాగా, అమెరికాలోని లూసియానాలో లాప్లేస్ ప్లాంట్ ఉండగా, టెక్సాస్‌లో వింటన్ ప్లాంట్ ఉంది. లూసియానాలో లాప్లేస్ ప్లాంట్‌తోపాటు ఓ రోలింగ్ మిల్లు కూడా ఉంది. వీటన్నింటినీ విక్రయిస్తుండగా, స్టీల్ బిల్లెట్లు, రేకులు, చానళ్లు, ఏజింల్స్, బీమ్‌లు, రీబార్, గ్రైండింగ్ మీడియాలు ఇక్కడ తయారవుతాయి.
కాగా, ఈ లావాదేవీలతో తమ వ్యాపారానికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా కూడా బ్లాక్ డైమండ్‌తో ఓ ఒప్పందాన్ని ఆర్సెలార్ మిట్టల్ చేసుకుంది. ఇకపోతే ఆర్సెలార్ మిట్టల్ ఉత్తర అమెరికా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు, సిఇఒ జిమ్ బాస్కే మాట్లాడుతూ ‘నాన్-కోర్ ఆస్తుల వ్యూహాత్మక అమ్మకంలో భాగంగానే లాప్లేస్, వింటన్ స్టీల్ ప్లాంట్లను విక్రయిస్తున్నాం. ఏళ్ల తరబడిగా తమకు సహకరించిన ఈ ప్లాంట్ల కార్మికులు.. భవిష్యత్తులోనూ కొత్త యాజమాన్యానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం.’ అన్నారు. ఇక బ్లాక్ డైమండ్ నిర్వహణలో 8 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులున్నాయి. ఇదిలావుంటే ఆర్సెలార్ మిట్టల్ నికర అమ్మకాలు గత ఏడాది 63.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అంతకుముందు ఏడాది 72.28 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. 2015లో సంస్థ నికర నష్టం 7.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, అంతకుముందు ఏడాది కేవలం 1.1 బిలియన్ డాలర్ల నష్టమే ఉంది.