జాతీయ వార్తలు

సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను పది రోజుల్లోగా పూర్తి చేయాలని, ఈ ఆదేశాలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 553 సీట్లు భర్తీపై ఆంధ్ర, తెలంగాణసహా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యా సంస్థలు, డాక్టర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనికి సబంధించిన పిటిషన్లు జస్టిస్ గోయల్, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రాగా కౌన్సిలింగ్ అనుమతి ఇస్తూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారంనాడు అన్ని రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 48 సీట్లు ఖాళీగా ఉండగా, దేశవ్యాప్తంగా 553 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. 1969 సీట్లకుగాను రెండు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ 553 సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్ల భర్తీకి సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా అదనపు సోలిటర్ జనరల్ మణీందర్ సింగ్ మాట్లాడుతూ, మిగిలిపోయిన సీట్ల భర్తీకి తమకు ఎటువంటి అభ్యతరం లేదని, ఈ ఏడాది ఈ సీట్లు భర్తీ కాకపోతే వచ్చే మూడేళ్లూ ఖాళీగా ఉండిపోతాయని కోర్టుకు వివరించారు. దీంతో ధర్మాసనం ఈ సీట్ల భర్తీకి సానుకులంగా స్పందించిందని న్యాయవాది అల్లంకి రమేష్ వెల్లడించారు.