జాతీయ వార్తలు

పెరోల్ ముగిసింది.. జైలుకొచ్చిన శశికళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 12: చెన్నై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భర్తను పరామర్శించేందకు ఐదు రోజుల పెరోల్‌పై వచ్చిన అన్నాడిఎంకె నాయకురాలు శశికళ గడువు ముగియడంతో తిరిగి గురువారం బెంగళూరు సెంట్రల్ జైలుకు వచ్చింది. ‘గురువారం సాయంత్రం 4.30 గంటలకు శశికళ జైలుకు వచ్చారు. ఆమెకు ఇచ్చిన గడువు లోపలే తిరిగి వచ్చారు’ అని జైళ్ల సూపరింటిండెంట్ జి సోమశేఖర్ తెలిపారు. ఐదు రోజుల పెరోల్ సందర్భంగా ఆమె ఎలాంటి ఉల్లంఘనలు పాల్పడలేదని ఆయన అన్నారు. శశికళ(60)కు ఈ నెల 6న పెరోల్ మంజూరైంది. 12వ తేదీ అంటే గురువారం సాయంత్రంలోగా తిరిగి లొంగిపోవాలని జైళ్ల అధికారులు ఆదేశించారు. పెరోల్‌పై బయటకు వచ్చిన శశికళ చెన్నైలోని జినియాగ్లెస్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భర్తను పరామర్శించారు. శశికళ భర్త నటరాజన్ (74)కు కిడ్నీ, కాలేయ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. తన భర్తను చూడడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేయాలని శశికళ అభ్యర్థించగా, కొన్ని నిబంధనలతో ఐదు రోజులే మంజూరు చేశారు. పెరోల్ సందర్భంగా మీడియాతో మాట్లాడడం, లేదా రాజకీయ సమావేశాలకు హాజరవ్వడం చేయకూడదని షరతులు పెట్టారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ, ఇలవరసీ, విఎన్ సుధాకర్‌లకు కోర్టు జైలుశిక్ష విధించింది. ముద్దాయిలందరూ ప్రస్తుతం బెంగళూరులోని పనప్పరం కేంద్ర కారాగారంలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇలావుండగా, చెన్నై నుంచి శశికళ తిరిగి వెళ్లేటప్పుడు ట్రేడ్ సెంటర్ పాయింట్ వంటి చోట్ల పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చి ఆమె బాగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అయిదు రోజుల పాటు అనేక మంది మహిళలు తమ శిశువులను తీసుకొని వచ్చి, పేర్లు పెట్టాల్సిందిగా శశికళను కోరారు. గురువారం నగరంలో అనేకచోట్ల ఆగిన తరువాత ఆమె కాన్వాయ్ బెంగళూరు హైవే మీదుగా సాగిపోయింది.