జాతీయ వార్తలు

కేంద్ర రాష్ట్రాలకు మీరే వారధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వారధిగా పని చేసే గవర్నర్లు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపిచ్చారు. గురువారం రాష్టప్రతి భవన్‌లో గవర్నర్ల 48వ సదస్సును ఆయన ప్రారంభిస్తూ 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెట్టుకున్న లక్ష్యాల సాధనకు గవర్నర్లు నడుం బిగించాలన్నారు. 27 మంది గవర్నర్లు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు సదస్సుకు హాజరయ్యారు. దాద్రా, నగర్ హవేలీ, డామన్ డియ్యు, లక్షద్వీప్ పరిపాలకులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే గవర్నర్ల సదస్సులో 2022 నాటికి నవభారత నిర్మాణానికి అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యతకు తావులేని నవ భారతాన్ని నిర్మాంచాలని రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. గవర్నర్లు తమ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించటం, వారిని తరచు రాజ్‌భవన్‌కు ఆహ్వానించి ప్రజాహితానికి సంబంధించిన అంశాల గురించి చర్చించటం ద్వారా రాష్ట్భ్రావృద్ధికి గణనీయంగా తోడ్పడాలని రాష్టప్రతి ఉద్బోధించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రజా సేవలు అత్యంత సులభంగా లభించాలని ప్రజలు కోరుకుంటున్నారు, పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని రామ్‌నాథ్ సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా గవర్నర్లు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకోవాలన్నారు. టీమ్ ఇండియా ఒకే దిశలో పయనించేందుకు గవర్నర్లందరూ భాగస్వాములు కావాలన్నారు. జాతి నిర్మాణానికి యువతను జోడించవలసిన బాధ్యత గవర్నర్లపై ఉన్నదని, యువతరం శక్తి సామర్థ్యాలు, నైతిక విలువలు, ప్రేమానురాగాలపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని కోవింద్ స్పష్టం చేశారు. యువతరం ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. స్వయంచలితం, కృత్రిమ మేధస్సు రంగం అభివృద్ధికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. సుధీర్ఘ లక్ష్యాల సాధనకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుందని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చూసేందుకు గవర్నర్లు కృషి చేయాలని అన్నారు. పౌరులను విశ్వసించటం నేర్చుకోవాలని ఆయన గవర్నర్లకు సూచించారు. గవర్నర్లు విశ్వవిద్యాలయాల చాన్సలర్లు, వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ఎప్పటికప్పుడు చర్చించటం ద్వారా రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడాలని సలహా ఇచ్చారు. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం రాష్టప్రతి నిర్వహించిన సమావేశానికి హాజరైన గవర్నర్లతో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్