జాతీయ వార్తలు

ట్రంప్ ప్రకటనతో ఇరకాటంలో కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా మారిన పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి అకస్మాత్తుగా మారిపోవటం ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదానికి తెర దించాలంటూ అమెరికా ఇటీవల పాకిస్తాన్‌పై పెద్దఎత్తున ఒత్తిడి తీసుకురావటం తెలిసిందే. పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటం నిలిపివేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించటంతోపాటు ఆ దేశానికి అందించే ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తామని బెదిరించింది. పాకిస్తాన్ సైన్యానికి అందజేసే ఆర్థిక సహాయంతోపాటు ఆయుధాల పంపిణీ, యుద్ధ విమానాల విక్రయం నిలిపివేస్తామని కఠినంగా హెచ్చరించింది. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తామని పరోక్షంగా బెదిరించారు. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐకి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నదని అమెరికా దుయ్యబట్టింది. అమెరికా ఒక దశలో పాకిస్తాన్‌పై ఉగ్రవాద దేశంగా ముద్ర వేసేందుకు సిద్ధమైంది. అమెరికా వత్తిడితో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ తమ విదేశాంగ శాఖ మంత్రిని వాషింగ్‌టన్‌కు పంపించింది. అనంతరం అమెరికా అకస్మాత్తుగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌తో ఇప్పుడిప్పుడే నిజమైన స్నేహం ఏర్పడుతోందని వ్యాఖ్యానించటం ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరిలో అకస్మాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చింది? పాకిస్తాన్‌తో ఇప్పుడు నిజమైన స్నేహం ఏర్పడుతోందని ట్రంప్ ఎందుకు ప్రకటించారనేది ఎన్‌డిఏ పాలకులకు అర్థం కావటం లేదు. పాకిస్తాన్‌ను ఏకాకిని చేయటంద్వారా ఆ దేశంతోపాటు చైనాను ఎదుర్కొనాలనుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ట్రంప్ ప్రకటన మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరిలో వచ్చిన మార్పుపై బిజెపికి చురకలు వేశారు. పాకిస్తాన్ దేశం, పాకిస్తాన్ నాయకులతో ఇప్పుడు మంచి సంబంధాలు ఏర్పడటం ప్రారంభం అయిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ- ‘మోదీజీ తొందరపడండి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో కౌగిలి అవసరమున్నట్లుంది’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకు వీలు కల్పించే ప్రతి అవకాశాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించకుంటారనేది అందరికీ తెలిసిందే. ట్రంప్ పాకిస్తాన్ సంబంధాలపై ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే రాహుల్ గాంధీ ఈ అంశంపై ట్వీట్‌చేస్తూ మోదీపై విమర్శలు గుప్పించటం చర్చనీయాంశంగా మారింది.
చిత్రం..ప్రధాని నరేంద్ర మోదీ