జాతీయ వార్తలు

హైదరాబాద్-కొచ్చువెలి మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-కొచ్చువెలి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 07115 హైదరాబాద్-కొచ్చువెలి ప్రత్యేక రైలు నవంబర్ 4,11,18,25 తేదీలలో హైదరాబాద్ నుంచి రాత్రి గం. 21:00లకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం గం. 03:20లకు కొచ్చువెలి చేరుకుంటుంది. అదేవిధంగా ట్రైన్ నెం.07116 కొచ్చువెలి నుంచి వచ్చే నెల 6,13,20,27 తేదీల్లో ఉ.గం. 07:45లకు బయలుదేరి మరుసటి రోజు మ.గం. 13:25లకు హైదరాబాద్ చేరుకుంటుందని, ఈ రైలు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కట్పడి, అంబుర్, వనియంబాదీ, జోలర్‌పేట, సేలం, త్రిపుర, కోయంబత్తూర్, ఎర్నాకులం, కొట్టాయం, తిరువల్ల, కొల్లం స్టేషన్లలో ఆగుతాయని సిపిఆర్‌ఓ ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.