జాతీయ వార్తలు

జాన్‌బాయ్ వంతెన పేల్చివేతకు మావో మిలీషియా సభ్యుల రెక్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 17: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా సభ్యులు అత్యంత గోప్యంగా జాన్‌బాయ్ వంతెన పేల్చివేతకు ప్రణాళిక రూపొందిస్తూ వంతెన వద్ద తిరుగుతుండగా అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు దారకొండలో సెల్ టవర్ దగ్ధం చేసారు. అనంతరం కోరుకొండకు చెందిన ఒక వ్యాపారిని కూడా హత్య చేసారు. అనంతరం ఎఒబిలో మావోయిస్టులు పోలీసులపై దాడులకు తెగబడుతూ తాజాగా జాన్‌బాయ్ వంతెన వద్ద మావోయిస్టు మిలీషియా సభ్యులతో రెక్కీ నిర్వహించి పేల్చివేతకు సన్నాహాలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో అటవీ ప్రాంతంలో ఉన్న బిఎస్‌ఎఫ్ జవాన్లకు బలిమెల రిజర్వాయర్ ద్వారా లాంచీలో ఆహార పదార్థాలను తరలిస్తుండగా మావోయిస్టులు హైజాక్ చేసి వాటిని అపహరించుకుపోయారు. ఎటువంటి హాని తలపెట్టలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. రామ్‌గూడ ఎన్‌కౌంటర్ నిరసనగా మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండడంతో ఎప్పుడేం జరుగుతోందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.