జాతీయ వార్తలు

అయోధ్య రామునికి ‘షియా’ బాణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 17: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ నిర్మాణం అన్నది మొత్తం హిందువులందరికీ గర్వకారణమని పేర్కొన్న ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ బోర్డు ఈ విగ్రహానికి పది వెండి బాణాలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటూ యుపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొంటూ తాము వెండి బాణాలను బహూకరించడం అన్నది రాముడిపట్ల షియాలకు ఉన్న భావానికి నిదర్శనమని బోర్డు చైర్మన్ వసీం రిజ్వి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీరాముడి విగ్రహ నిర్మాణంతో ఉత్తరప్రదేశ్ ప్రపంచ పటంలో చేరుతుందని స్పష్టం చేశారు.