జాతీయ వార్తలు

కేరళ హింస వెనక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కేరళలో హింసకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపియే కారణమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ధ్వజమెత్తారు. బిజెపి చేపట్టిన ర్యాలీని ఎద్దేవా చేసిన ఏచూరి ‘బిజెపి తీరు ఇలాగే ఉంటే కేరళలో ఒక్క స్థానంలోనూ విజయం సాధించదు’ అని తేల్చిచెప్పారు. జన రక్షణ పేరుతో బిజెపి చేపట్టి దీక్ష మంగళవారంతో ముగిసింది. ‘కేరళలో అశాంతిని సృష్టించి, హింసను ప్రోత్సహిస్తే సహించేదిలేదు. రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు గెలవలేరు’ అని సిపిఎం నేత హెచ్చరించారు. బిజెపి కేంద్ర కార్యాలయం ఎదుట కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఏచూరి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దక్షిణాదిన పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేరళలో యాత్రకని వెళ్లిన బిజెపి చీఫ్ అమిత్ షా, కొడుకు అవినీతి బండారం బయటపడడంతో ఢిల్లీకి పరుగులెత్తుకొచ్చారని సిపిఎం నేత విమర్శించారు. కుమారుడిని రక్షించుకునేందుకు బిజెపి చీఫ్ పడరానిపాట్లు పడుతున్నాడని ఏచూరి ధ్వజమెత్తారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక అమిత్‌షా కుమారుడు జయ్ షా అక్రమ మార్గాల్లో లక్షలాది కోట్లు సంపాదించాడని ఆయన చెప్పారు. దేశ ప్రజల్లో ఎర్రజండా మమేకమై పనిచేస్తోందని, దాన్ని తొలగించడం బిజెపి తరం కాదని స్పష్టం చేశారు.