జాతీయ వార్తలు

భారత్-నేపాల్ బంధం ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భారత్‌తో నేపాల్ సంబంధాలు అత్యంత ప్రత్యేకమైనవని, అయితే రానున్న ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకోసం భారత్ వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆ దేశ రాయబారి దీప్‌కుమార్ ఉపాధ్యాయ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. చైనా ద్వారా రవాణా మార్గాలను పెంపొందించుకోవడంతోపాటు అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆ దేశ నిధులను వినియోగించుకోవాలని నేపాల్ భావిస్తోందని ఆయన తెలిపారు. అయినప్పటికీ భారత్‌తో ద్వైపాక్షిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు నేపాల్‌కు అత్యంత కీలకమైనవని, ఈ రెండు దేశాల మధ్య భౌగోళికంగానేకాక, రాజకీయంగా కూడా బలమైన బంధం ఉందని వెల్లడించారు. ఇటీవలే ఆయన రాయబార పదవికి రాజీనామా చేశారు. అయితే ఇంతవరకూ ఆ రాజీనామాను నేపాల్ మంత్రి మండలి ఆమోదించలేదు. మంగళవారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఉపాధ్యాయ నేపాల్ పార్లమెంట్‌లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అన్నది అంత తేలిక కాదని, సంకీర్ణ కూటముల ద్వారానే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందేనని, ఇందుకు మరో మార్గం లేదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత్-నేపాల్ సంబంధాలను ప్రస్తావిస్తూ, రాజకీయ లబ్ధిపొందేందుకు కొన్ని పార్టీలు కచ్చితంగా ప్రయత్నిస్తాయని పేర్కొన్న ఆయన- నేపాల్ కొత్త రాజ్యాంగం అమలులోకి రావడంతో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంతమేర దెబ్బతిన్న విషయాన్ని ఈ సందర్భగా వెల్లడించారు. నవంబర్ 26న రాష్ట్ర ఎన్నికలను డిసెంబర్ 5న ఫెడరల్ ఎన్నికలను నిర్వహించాలని నేపాల్ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నేపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల్లో ఒకరైన ఉపాధ్యాయ 2015లో భారత రాయబారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అప్పటి కె.వి.ఓలి ప్రభుత్వం ఆయనను వెనక్కి పిలిచింది. ఓలి ప్రభుత్వ రాజీనామా అనంతరం ఉపాధ్యాయనే భారత రాయబారిగా పునర్నియమిస్తూ అనంతర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.