జాతీయ వార్తలు

రాజస్థాన్ పోలీసులపై క్రమశిక్షణ చర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 17: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోధ్‌పూర్ పర్యటన సందర్భంగా విధులకు గైర్హాజరైన 250 మంది పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. హోమ్‌మంత్రి గార్డ్ ఆఫ్ ఆనర్‌లో పాల్గొనాల్సిన కానిస్టేబుళ్లు మూకుమ్మడి సెలవుపెట్టి గైర్హాజరవ్వడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీతంలో కోత పెట్టారన్న వార్తల నేపథ్యంలో విధులకు డుమ్మాకొట్టారని అంటున్నారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించడానికి రాజ్‌నాథ్ సోమవారం జోధ్‌పూర్ వచ్చారు. ‘మొత్తం 250 మంది పోలీసులు మూకుమ్మడి లీవ్ పెట్టేశారు. అందులో కొందరికి హోమ్‌మంత్రికి గార్డ్ ఆఫ్ ఆనర్ బాధ్యతలున్నాయి. వారుకూడా చెప్పాపెట్టకుండా డ్యూటీ ఎగ్గొట్టారు. గైర్హాజరైన వారి స్థానంలో మరొకర్ని నియమించామని జోధ్‌పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ వెల్లడించారు. లీవ్ మంజూరు కాకుండా సెలవు తీసుకోవడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని ఆయన అన్నారు. హోమ్‌మంత్రితో పాటు జోధ్‌పూర్ వెళ్లిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ లాథర్ ఈ పరిణామంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరోచోట ఇలాంటి పరిస్థితే తలెత్తింది. జైపూర్ సివిల్ లైన్స్ మెట్రోస్టేషన్ వద్ద నియమితులైన పది మంది పోలీసు కానిస్టేబుళ్లూ విధులకు గైర్హాజరయ్యారు. జీతంలో కోత విధించారన్న వార్తల నేపథ్యంలో నిరసన తెలిపినట్టు తెలిసింది. జీతంలో కోత పడిందన్న వార్తలు పోలీసుల్లో కలకలం రేపింది. 24వేల జీతం రావల్సి ఉండగా 19వేలకు తగ్గించారని కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్ర హోమ్‌మంత్రి గులాబ్‌చంద్ కటారియా ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. కానిస్టేబుళ్లు లేదా అధికారుల జీతాలు తగ్గిస్తూ ఎలాంటి జీవో ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. జీతాలకు సంబంధించిన అంశం కేబినెట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉందని కాబట్టి దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.

చిత్రం..పంజాబ్‌లోని ఫిరోజెపూర్ జిల్లాలో అమర వీరులకు నివాళులర్పిస్తున్న హోమ్‌మంత్రి రాజ్‌నాథ్