జాతీయ వార్తలు

వేడెక్కిస్తున్న ‘వాద్రా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ / బెంగళూరు, అక్టోబర్ 17: కాంగ్రెస్-బిజెపిల మధ్య రాబర్డ్ వాద్రా వ్యవహారం చిచ్చు రేపుతోంది. పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో వాద్రాకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి విరుచుకుపడింది. ఈ అంశంపై రాబర్ట్ వాద్రా నోరు మెదపనప్పటికీ కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా మాత్రం ఎదురు దాడికి దిగారు. తమ పార్టీ అధినేత్రి అల్లుడిపై వచ్చిన ఈ ఆరోపణల నిజానిజాలు తేల్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి దర్యాప్తుకైనా ఆదేశించవచ్చునని ఆయన సవాలు విసిరారు. 2012లో వాద్రా విదేశీ పర్యటనకు సంబంధించి భండారీ టిక్కెట్లు బుక్ చేశారంటూ మీడియా కథనాలు వచ్చాయి. వీటిపైనే బిజెపి తరఫున రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్ ‘వాద్రాపై వచ్చిన ఆరోపణలపై సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు ఎందుకు వౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. వీరిద్దరి వౌనం వల్ల వాద్రాపై వచ్చిన ఆరోపణలను అంగీకరించినట్టుగానే భావించాల్సి వస్తుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. వాద్రాకు చెందిన లండన్‌లోని ఓ ఇంటిని భండారి మరమ్మతులు చేయించారని, అలాగే ఆయన విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చేశారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆమె ఉటంకించారు. భండారీ బ్యాంకు ఖాతాలో 7.5 లక్షల స్విస్ ఫ్రాంక్‌లను డిపాజిట్ చేశారని పేర్కొన్న సీతారామన్, ‘ఈ చర్యకు లండన్‌లోని వాద్రా ఇంటి మరమ్మతులపై జరిపిన ఖర్చుకు సంబంధం ఉందా?’ అని ప్రశ్నించారు. తీవ్రమైన ఆర్థిక పర్యవసానాలకు దారితీసే మూడు లావాదేవీలు వీరి మధ్య జరిగాయని తెలిపారు. తరచు ట్వీట్లు చేసే రాహుల్ గాంధీ వాద్రా వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. భండారీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ ఏమి చేస్తోందన్న మీడియా ప్రశ్నకు జవాబిచ్చిన నిర్మలా సీతారామన్ ‘ఈ ప్రశ్నను నన్ను కాదు సిబిఐని అడగండి’ అని అన్నారు. పరారీలో ఉన్న ఈ ఆయుధ వ్యాపారిని భారత్‌కు తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వాద్రా నిర్దోషి అని కాంగ్రెస్ నేతలు భావిస్తే ఎందుకు పరువు నష్టం దావా వేయడం లేదని బిజెపికి చెందిన మరో ప్రతినిధి జి.వి.ఎల్.నర్సింహారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ వౌనాన్ని బట్టి చూస్తే వాద్రా తప్పు చేశాడన్న భావన కలుగుతోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్ర విజయ్ రూపానీ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జీతు వాఘానీ కూడా గాంధీనగర్‌లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వాద్రాపై వచ్చిన ఆరోపణల విషయంలో రాహుల్ గాంధీ వౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో సామాజిక మీడియాలో రాహుల్ మరింత క్రియాశీలకంగా మారారని, తరచూ గుజరాత్‌కు కూడా వస్తున్నారని పేర్కొన్న రూపానీ, ఇంత చేస్తున్నప్పుడు వాద్రా గురించి వచ్చిన ఆరోపణలను ఆయన ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. చివరకు గుజరాత్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశం గురించి మాట్లాడడం లేదని పేర్కొన్న రూపానీ ఓ ఆయుధ వ్యాపారితో వాద్రా సంబంధాలపై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

చిత్రాలు.. నిర్మలా సీతారామన్, రాబర్డ్ వాద్రా