జాతీయ వార్తలు

ఆ మెరుపు వెనుక మన స్వేదం ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ‘చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ని ఎవరు కట్టారు? ఎందుకు కట్టారు? అన్నది ముఖ్యం కాదు. చారిత్రక శే్వత కట్టడం వెనుక భారతీయ కూలీల స్వేదం, రుధిరం కలగలిసి ఉన్నాయి’ అని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే సిఎం యోగి ఈ విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై కొన్ని రోజులుగా వివాదాలు ముసురుతున్న విషయం తెలిసిందే. యూపీలో బిజెపి సర్కారు ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో పర్యాటక శాఖ ఒక బ్రోచర్‌ను విడుదల చేసింది. ఆ బ్రోచర్‌లో తాజ్‌మహల్ ప్రస్తావన లేకపోవడం పెద్ద వివాదమైంది. వెంటనే తేరుకున్న ప్రభుత్వం, పర్యాటకంగా తాజ్‌మహల్‌కు మరింత ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా దాని పరిసరాల్లో ఎన్నో ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసింది. వివాదం సద్దుమణుగుతున్న సమయంలో సోమవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ‘్భరతీయ సంస్కృతిమీద తెల్ల తాజ్‌మహల్ ఓ మాయని మచ్చ. సాంస్కృతిక ఆస్తిగా పరిగణించే వాళ్లంతా, దాన్ని నిర్మించింది ఒక దేశద్రోహి అన్న విషయాన్ని గుర్తెరగాలి’ అంటూ మరో సంచలనం లేపారు. 24 గంటలు తిరగకముందే సిఎం యోగి ఆదిత్యనాథ్, ఆ నిర్మాణం వెనుక భారత కూలీల శే్వధం, రుధిరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 25న ఆగ్రా పర్యటనలో భాగంగా తాజ్‌మహల్‌ను సందర్శిస్తానని ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే సంగీత్‌సోమ్ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రతిస్పందిస్తూ ‘సోమ్ వ్యాఖ్యలను వ్యక్తిగతం అనుకోలేం. బిజెపి వైఖరిగానే భావించాలి’ అని ప్రకటించారు. బిజెపి ఇరకాటంలో పడే పరిస్థితి రావడంతో, యోగి వివాదాన్ని చల్లబర్చేందుకు ఈ విధమైన ప్రకటన చేశారా అన్న చర్చ వినిపిస్తోంది.