జాతీయ వార్తలు

షరా.. మామూలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఢిల్లీలో గత అర్థరాత్రి పరిస్థితిని పరిశీలిస్తే, వాతావరణ కాలుష్యం తీవ్రాతి తీవ్రమైన స్థాయిలోనే ఉందని సర్వేలు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితికి కారణం, సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని కాదని జనమంతా బాణసంచా కాల్చడమేనని సర్వేలు స్పష్టం చేశాయి. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం భయానక పరిస్థితికి చేరుకుంటుండటంతో, అనేక నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఫెస్టివ్ ఆఫ్ లైట్స్’గానే దీపావళిని జరుపుకోవాలని అనేక స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. పైగా, ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలో ఎక్కడా బాణసంచా అమ్మకాలు సాగనివ్వకుండా సుప్రీంకోరు నిషేధనం సైతం విధించింది. అయితే, గురువారం సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రశాంతంగావున్న ఢిల్లీ, ఆ తరువాత ఒక్కసారిగా బాణసంచా శబ్దాలు, పొగతో కునారిల్లిందని బ్యూ ఎయిర్ ఫ్రెండ్ యాప్ సర్వే స్పష్టం చేసింది. గురువారంనాటి పరిణాల్లో ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సర్వే నిర్వహించిన ఈ యాప్, ఒక్క ఆనంద్‌విహార్ ప్రాంతంలో సాధారణ కాలుష్య ప్రమాణాలకు (ఎక్యుఐ) ఐదు రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైనట్టు వెల్లడించింది. ఎక్యుఐ ప్రమాణాల ప్రకారం 0-50వుంటే కాలుష్యరహితం, 401నుంచి పైనవుంటే తీవ్రస్థాయి కాలుష్యప్రాంతంగా గుర్తిస్తారు. దీని ప్రకారం చూస్తే పశ్చిమ విహార్, ఆర్‌కె పురం, ఫరీదాబాద్, ద్వారక ప్రాంతాలు ప్రమాదకర కాలుష్య పరిస్థితిని ఎదుర్కొన్నాయని బ్లూఎయిర్ ఫ్రెండ్ యాప్ అధ్యయనం వెల్లడించింది. ‘నగరంలో ప్రమాదకరస్థితికి కాలుష్యం పెరిగిపోవడానికి బాణసంచాయే కారణం. ప్రజారోగ్యం, నగరం భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నగరవాసులే వాతావరణ కాలుష్య కారకాలపై స్వచ్ఛంద నిషేధం విధించుకోవాలి.
అత్యున్నత న్యాయస్థానాలు బాణసంచాపై నిషేధం విధించినా పాటించకపోవడం దారుణం’ అని బ్యూఎయిర్ ఆసియా రీజియన్ డైరెక్టర్ గిరీష్ బాపట్ వ్యాఖ్యానించారు. కాలుష్య ప్రమాద పరిస్థితిని ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకోకుంటే, భవిష్యత్‌లో ఆస్తమా, ఊపిరి సంబంధ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.