జాతీయ వార్తలు

గాలి పీలిస్తే గాల్లోకే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత్‌లో వాయు, జల ఇతర కాలుష్యాల కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య ఎప్పటికప్పుడు తీవ్రమవుతోంది. 2015లో ఈకారణాల వల్ల రెండున్నర లక్షల మంది మరణించారని, ఈ కాలుష్య జాబితాలో మొదటి స్థానం భారత్‌దేనని తాజాగా వెల్లడైన ఓ అధ్యయనంలో స్పష్టమైంది.
గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల కేన్సర్, ఇతర శ్వాస సంబంధిత వ్యాధుల కారణంగానే ఈ మరణాలు సంభవించాయని లానె్సట్ అనే జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసం వెల్లడించింది. వాయు కాలుష్యం కారణంగానే 2015లో 6 లక్షల 50 వేల మంది మరణించారు. జల కాలుష్యంతో లక్షా 80 వేల మంది మృతి చెందారని, పనిచేసే చోట తగిన కాలుష్య నిరారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల 80వేల మంది మృత్యువాత పడ్టారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 92 శాతానికి పైగా కాలుష్యకారక మరణాలన్నీ మధ్య,దిగువ ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయని ఢిల్లీ ఐఐటి అలాగే అమెరికాలోని ఐకన్ వైద్య కేంద్ర పరిశోధకులు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న లేదా పారిశ్రామికంగా విస్తరిస్తున్న భారత్, పాకిస్తాన్, చైనా వంటి దేశాల్లో ప్రతి నాలుగు మరణాల్లో ఒక్కరు చొప్పున ఉంటున్నారని అధ్యయన కర్తలు వెల్లడించారు. 2015 లెక్కల ప్రకారం భారత్‌లో కాలుష్య కారణంగా అత్యధిక స్థాయిలో 25 లక్షల మంది మృతి చెందారన్నారు. చైనాలో 18 లక్షల మంది చనిపోయినట్టు నివేదికలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం వల్ల ఏటా 90 లక్షల మంది మరణిస్తున్నట్టు మొత్తం మరణాల్లో ఇది 16 శాతమని పేర్కొన్నారు.