జాతీయ వార్తలు

శరద్‌యాదవ్‌కు నోటీసులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: జెడియు పార్టీ నుంచి ఎన్నికైన శరద్‌యాదవ్, అలీ అన్వర్ అన్సారీలకు పార్లమెంట్ సభ్యత్వ అనర్హత ఫిర్యాదుపై రాజ్యసభ సచివాలయం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జెడియు మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఎంపీ అన్సారీల రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతూ ఉపరాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని జెడియు నేతలు ఫిర్యాదు చేశారు. జెడియు రెబల్ నాయకులు శరద్‌యాదవ్, అలీ అన్సారీలు ఈ నెల 30న రాజ్యసభ ఛైర్మన్ ముందు హాజరై తమ తమ వాదనలు వినిపించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎంపీ అలీ అన్సారీ వచ్చే ఏడాది ఏప్రిల్‌తో పదవీ కాలం పూర్తికానుంది. అలాగే శరద్ యాదవ్ 2022 వరకు రాజ్యసభ పదవిలో కొనసాగనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని శరద్ యాదవ్ వ్యతిరేకించారు. నితీష్‌కు వ్యతిరేకంగా శరద్‌యాదవ్ విమర్శలు చేశారు. దీంతో నితీష్ వర్గం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. సాధారంగా ఇటువంటి ఫిర్యాదులు మొదట రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ దృష్టికి వెళతాయి. అయితే రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు తానే స్వయంగా ఈ ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.