జాతీయ వార్తలు

పట్టాలపై ఇక జెట్ స్పీడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: సుదూర ప్రాంతం ప్రయాణించే 500 రైళ్ల వేగం త్వరలో పెరగనుంది. ఆమేరకు ప్రయాణికుల సమయాన్ని కనీసం 2గంటల మేర ఆదా చేసేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను త్వరలోనే అమల్లోకి తేనున్నట్టు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణ కాలాన్ని నవంబర్ నుంచి అమల్లోకి తేనున్నట్టు ఆయన వెల్లడించారు. అక్టోబర్ ఆరంభంలో రైళ్ల సమయాలపై సమీక్ష నిర్వహించిన రైల్వే మంత్రి పియూష్ గోయల్, సుదూరం ప్రయాణించే రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ కాలాన్ని తగ్గించాలని సూచించారు. ఈమేరకు కొత్త ప్రయాణ ప్రణాళిక నవంబర్ నుంచి అమల్లోకి రానుందని ఆ అధికారి వెల్లడించారు. అంతేకాదు, కొత్త టైంటేబుల్ ప్రకారం ప్రతి డివిజన్ మెయింటెనెన్స్ కోసం 2 నుంచి 4 గంటల కాలాన్ని కేటాయించబోతున్నారు. ‘మా ప్రణాళిక రైలు ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడానికే. అది రెండు విధాలుగా చేపట్టబోతున్నాం. అనేకచోట్ల తిరిగి రావాల్సిన రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దీనివల్ల ఆ ట్రాక్‌లో తిరిగే మరో రైలూ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. అలా 50 రైళ్ల వరకూ గుర్తించాం. ఈ పరిస్థితిని కొత్త కాలపట్టిక ప్రకారం అధిగమించగలిగితే, 51వ రైలు ప్రయాణంలో గంట నుంచి మూడు గంటలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇలా, దేశవ్యాప్తంగా 500 రైళ్లను గుర్తించాం’ అని ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి 500 రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే విభాగం సిద్ధం చేసిన ప్రణాళిక నవంబర్ నుంచే అమల్లోకి రానుంది.