జాతీయ వార్తలు

ఇక నోరు మూసుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: షా-జాదా (రాజుగారి పుత్రరత్నం) గురించి ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. నోరు మూసుకుందాం’ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యంగ్య ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా కంపెనీలో అకస్మాత్తుగా పెరిగిన పెట్టుబడుల వ్యవహారం నిగ్గుతేల్చాలంటూ కొంతకాలంగా కాంగ్రెస్ దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా కంపెనీ కోట్లకు పడగలెత్తిన వైనాన్ని ‘ద వైర్’ పత్రిక ఎండగట్టింది. ఈ అంశంపై కాంగ్రెస్ కొద్దిరోజులుగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. అయితే, తన పరువుకు భంగం కలిగే విధంగా ఎలాంటి వ్యాఖ్యానాలు, కథనాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించకుండా ‘ది వైర్’ సంస్థకు ఆదేశాలివ్వాలంటూ జే షా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జే పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ రూరల్ కోర్టు, ఎలాంటి కథనాలు ప్రచురిచవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయాన్ని ‘ది వైర్‌కు అలహాబాద్ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వు: జే షా మీద ఎలాంటి కథనాలు ప్రచురించవద్దు. చర్చా కార్యాక్రమాలు చేపట్టవద్దు’ అని ట్వీట్ చేస్తూ, ‘దీనిపై నేనూ నోరుమూసుకుంటాను. మిత్రులు కూడా నోరు మూసుకుంటే మంచిది’ అని ట్వీట్ చేశారు. ‘ది వైర్’లో కథనం ప్రచురితమైన తరువాత, బిజెపి అధ్యక్ష స్థానం నుంచి అమిత్ షాను తప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో జే షా కంపెనీ వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం తెలిసిందే. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వౌనం వహించడం, పార్టీ అధ్యక్షుడి బండారం బయటపడినట్టేనని కాంగ్రెస్ పదేపదే వ్యాఖ్యానిస్తూ వచ్చింది. ఇప్పుడు న్యాయస్థానం దీనిపై మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తూ ‘నోరు మూసుకుందాం. మీరూ మూసుకోండి’ అంటూ ట్వీట్ చేయడం సంచలనమవుతుంది.

చిత్రం..రాహుల్ గాంధీ