జాతీయ వార్తలు

కల సాకారమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘోఘా (గుజరాత్), అక్టోబర్ 22: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని ఘోఘాలో రోల్-ఆన్ రోల్-ఆఫ్(రోరో) ఫెర్రీ సర్వీసులను ఆదివారం ప్రారంభించిన మోదీ గత యుపిఏ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ అభివృద్ధిని యుపిఏ ప్రభుత్వం అడ్డుకుందని ఆయన విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రారంభించిన ప్రాజెక్టులకు వివిధ సాంకేతిక కారణాలు చూపి అడ్డుకున్నారని ఆయన అన్నారు. 2012లో తాను శంకుస్థాపన చేసిన రోరో ఫెర్రీ సర్వీసులు ప్రారంభించడంతో తన కల నెరవేరిందని ప్రధాని చెప్పారు. ఆనాడు పర్యావరణ పేరుతో అనేక ప్రాజెక్టులకు యుపిఏ ప్రభుత్వం మోకాలడ్డిందని మోదీ తెలిపారు. రోరో ఫెర్రి సర్వీసు వల్ల ఘోఘా-దహేజ్ పట్టణాలను మరింత చేరువ చేసిందని, ప్రయాణకాలం గంటన్నరకు తగ్గిపోతుందని వివరించారు. రోడ్డు మార్గం గుండా 301 కిలోమీటర్లుండగా, ఫెర్రీవల్ల 30 కిలోమీటర్లకు తగ్గిపోతుందని ప్రధాని తెలిపారు. గత చరిత్రను పరిశీలిసేత సముద్ర, నదుల రవాణాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఫెర్రీ వినియోగంవల్ల సమయం, పెట్రోలు ఎంతో ఆదా అవుతుందని అన్నారు. ఈ ఫెర్రీ సర్వీసులను కేవలం ఒక మార్గానికే పరిమితం కాదని త్వరలోనే మరిన్ని మార్గాలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. రోరో ఫెర్రి సర్వీసులను సౌరాష్ట్ర జిల్లా హాజిరాకు విస్తరించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి ప్రాజెక్టు మరొకటి గుల్ప్ ఆఫ్ కచ్‌లో తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్ అభివృద్ధికోసం తాను చేపట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ అవరోధాలు కల్పించిందన్న ప్రధాని ‘ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా వెనుదిరగను. అభివృద్ధే అజెండాగా ముందుకెళ్తా’ అని ప్రకటించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్ట్ అని ఆయన చెప్పారు. ఘోఘా-దహేజ్ మధ్య నడిచే ప్రాజెక్టు అయినప్పటికీ దేశంలోనే ఎంతో కీలమైన పథకమని ప్రధాని అన్నారు. సౌరాష్ట్ర, గుజరాత్‌లను అనుసంధానం చేసే ఆ ప్రాజెక్టువల్ల ఇంధనం, సమయం ఎంతో ఆదా అవుతాయని ఆయన తెలిపారు. రవాణా రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్న ప్రధాని దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే కేంద్రం ప్రభుత్వం అవరోధాలు కల్పించిందన్నారు. కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధానపరమైన అనేక మార్పులు వచ్చాయని మోదీ స్పష్టం చేశారు.

చిత్రం..రోరో ఫెర్రీ సర్వీసును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ