జాతీయ వార్తలు

‘తెలంగాణకు అన్యాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: విభజన చట్టం అమలు విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్ విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలోని అంశాలు హైకోర్టు విభజన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అధికారుల విభజన, విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్ర తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు విభజనతోపాటు అనేక అంశాలకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఎనిమిదిసార్లు విజ్ఞప్తి చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు భవనాన్ని, వౌలిక సాదుపాయలను కల్పిస్తామన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం లేదన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో విషయంలోనూ తెలంగాణకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆ ప్రతినిధులు విమర్శించారు. తాజాగా కేంద్రానికి పంపిన న్యాయమూర్తుల జాబితాలోనూ తెలంగాణకు తీవ్రనష్టం జరుగుతోందని అన్నారు.