జాతీయ వార్తలు

వికాసవాదం.. అదే మా నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: దేశంలో కొన్నిరోజులుగా రెండు వాదాలు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయ. అవి ఒకటి వికాస వాదం. రెండు విరోధ వాదం. మనం వికాసవాదాన్ని అనుసరించే ముందుకుపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రాత్రి ఇండియాగేట్ వద్ద ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మెగా ఈవెంట్ ‘ఏక్ నరుూ సుబహ్’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. కేంద్ర మంత్రులు ఒకరి తరువాత ఒకరుగా తమ తమ శాఖల ప్రగతిని వివరించిన అనంతరం మోదీ తన ప్రభుత్వం పనితీరును తనదైన రీతిలో విశే్లషించారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలు చెప్పుకుంటూ పోతే దూరదర్శన్ వాళ్లు ఇండియాగేట్ వద్ద వారం రోజులు ఉన్నా సరిపోదని మోదీ అన్నారు. దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాకముందు ఏం జరిగిందీ.. ప్రస్తుతం ఏం జరుగుతోందన్న అంశాల్ని ప్రజలు సునిశితంగా గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు తమ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారని ఆయన అన్నారు. రోజు రోజుకూ ప్రజలకు తమ ప్రభుత్వం పట్ల నమ్మకం అపారంగా పెరుగుతూ వస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ పనిని సమగ్రంగా సమీక్షించుకోవటం అవసరమని.. అయితే నిరాశాజనకమైన వాతావరణాన్ని సృష్టించే తప్పు చేయకూడదని మోదీ అన్నారు. గత ప్రభుత్వం అవినీతిపరమైందన్న అంశాన్ని అంగీకరించని వారు దేశంలో ఎవరూ ఉండరని.. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతిని అంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నామని మోదీ వివరించారు. అవినీతిని అడ్డుకునేందుకు విస్తృతంగా చేసిన ప్రచారం ద్వారా పక్కదారి పడుతున్న దాదాపు రూ.36వేల కోట్లను ఆపగలిగామని మోదీ తెలిపారు. అవినీతి అన్నది దేశాన్ని, దేశ ప్రజల కలల్ని నాశనం చేసిందన్నారు. ఈ పరిణామక్రమంలోనే దేశవ్యాప్తంగా 1.62 కోట్ల బోగస్ రేషన్ కార్డులను ఏరివేశామని వివరించారు. 3, 4 తరగతుల ప్రభుత్వోద్యోగులకు ఇంటర్వ్యూలు లేకుండా చేయటం ద్వారా కిందిస్థాయిలో అవినీతిని నిరోధించామని మోదీ తెలిపారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి ముఖ్య కారణం, వాళ్ల అవినీతి ప్లగ్‌లను తాము లాగేయటమేనని ఆయన విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే కొందరికి తనను విమర్శించక తప్పటం లేదని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలో అయిదు కోట్ల మందికి వంటగ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. తానిచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి 1.13కోట్ల మంది తమ ఎల్పీజీ సబ్సిడీని వెనక్కి ఇచ్చారని ఆయన చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా మంచి పరిపాలన అందించాలంటే ప్రజల నమ్మకం చూరగొనటమేనని మోదీ స్పష్టం చేశారు. తాను కలలు గంటున్న టీం ఇండియా సాధనకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా కష్టపడుతున్నామని మోదీ చెప్పారు.