జాతీయ వార్తలు

బీజేపీకి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*చిత్రకూట్ స్థానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్
భోపాల్, నవంబర్ 12: మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. నవంబర్ 9న పోలింగ్ జరగ్గా ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలాంషు చతుర్వేది సమీప బిజెపి అభ్యర్థిపై 14,133 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి 66,180 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి త్రిపాఠికి 52,677 ఓట్లు లభించాయి. అయితే 2,455 ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ (65) మృతిచెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రేమ్‌సింగ్ ఈ నియోజకవర్గం నుంచి 1998, 2003, 2013 ఎన్నికల్లో గెలుపొందారు. కాగా 2008లో మాత్రం బిజెపి అభ్యర్థి సురేంద్ర సింగ్ గహర్వార్ చేతిలో ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు
చిత్రకూట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంపట్ల ఎఐసిసి హర్షం వ్యక్తం చేసింది. పరిస్థితులు మెల్లమెల్లగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలా తెలిపారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..చిత్రకూట్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు