జాతీయ వార్తలు

అహింసే మన ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: అహింసా విధానాలను అవలంభించటం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చునని ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్భోదించారు. అహింసా విశ్వభారతి 13వ స్థాపనోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వెంకయ్య ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ప్రపంచం, దేశం, సమాజంలో అహింస, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పేందుకు కృషిచేస్తున్న అహింసా విశ్వభారతి సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. సమాజ సేవకు మతాన్ని అనుసంధానం చేయటంద్వారా సామాజిక రుగ్మతలను సులభంగా తొలగించవచ్చునని అన్నారు. మతాన్ని తాత్విక చింతనతో అనుసంధానం చేస్తే ఈ రంగంలో ఎన్నో సత్ఫలితాలు సాధించవచ్చునని నాయుడు తెలిపారు. అభివృద్ధిని సాధించేందుకు సమాజంలో శాంతి, సౌభ్రృతృత్వాలను నెలకొల్పవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. హింస ఏ సమస్యనూ పరిష్కరించదు, అహింస ఒక్కటే సమాజంలోని సమస్యలకు పరిష్కారమార్గం. హింస మళ్లీ హింసకు దారి తీస్తుందనేది మరిచిపోరాదని వెంకయ్య నాయుడు ఉద్భోదించారు. అహింసా పద్ధతిలో చర్చలు, సంప్రదింపుల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని ఆయన తెలిపారు. మహావీరుడు, బుద్ధుడి వంటి మహానుభావులు అహింసా మార్గాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, జాతిపిత మహాత్మా గాంధీ అహింస ద్వారానే దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని అన్నారు. అహింస అంటే పిరికితనం కాదని ఆయన స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశం ప్రాథమిక, మూల సిద్ధాంతం. సర్వమత సమన్వయం మన మూలమంత్రం. ఇక్కడే అహింస, శాంతి, సౌభ్రాతృత్వం ప్రారంభం అవుతుందని ఉప రాష్టప్రతి చెప్పారు. అహింసా విశ్వ భారతి సమాజ సేవ, యువతను అహింసా మార్గంతో అనుసంధానం చేయటం ద్వారా సమాజాభివృద్ధి, దేశాభివృద్ధికి ఎనలేని సేవ చేస్తుందనే ఆశాభావాన్ని ఉపరాష్టప్రతి వ్యక్తం చేశారు.

చిత్రం..ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన అహింసా విశ్వభారతి వార్షికోత్సవంలో
సావనీర్‌ను విడుదల చేస్తున్న వెంకయ్య నాయుడు తదితరులు