జాతీయ వార్తలు

తొమ్మిది హైకోర్టులకు 40మంది కొత్త జడ్జీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశంలోని తొమ్మిది హైకోర్టులకు 40 మంది కొత్త న్యాయమూర్తులను నియమించడంపై సుప్రీంకోర్టు కొలీజియం దృష్టి సారించనుంది. 40 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి తొమ్మిది హైకోర్టుల నుంచి వచ్చిన సిఫారసులను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించి, సుప్రీంకోర్టు కొలీజియంకు పంపించిందని ఒక అధికారి తెలిపారు. కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, మద్రాస్, త్రిపుర తదితర హైకోర్టుల నుంచి ఈ సిఫారసులు అందాయని ఆయన వెల్లడించారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ ఒకటి నాటికి 24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, అందులో 413 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 666 మంది న్యాయమూర్తులతోనే హైకోర్టులు పనిచేస్తున్నాయి. ముగ్గురు సభ్యుల హైకోర్టు కొలీజియం న్యాయమూర్తి పేరును సుప్రీంకోర్టు కొలీజియంకు సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసును తొలుత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. ఈ సిఫార్సుతో పాటు సదరు అభ్యర్థికి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టు కూడా ఉంటుంది.
తుది నిర్ణయం కోసం ఈ సిఫారసును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు కొలీజియంకు పంపిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఎవరుండాలనే అంశాన్ని సరిగా నిర్ణయించగలిగింది న్యాయ వ్యవస్థే తప్ప ఐబీ కాదని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.