జాతీయ వార్తలు

మీ ముఖ్యమంత్రే నీతిబాహ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలన్‌పూర్ (గుజరాత్), నవంబర్ 12: మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్పడిన నీతి బాహ్యమయిన చర్యపై మీ సమాధానం ఏమిటంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రాహుల్ గాంధీ తన ఉత్తర గుజరాత్ పర్యటనలో రెండో రోజయిన ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని ప్రసంగించారు. రూపానీకి చెందిన సంస్థ షేర్ల లావాదేవీల్లో మోసపూరితంగా వ్యవహరించినందుకు సెబీ (స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) జరిమానా విధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మీ ముఖ్యమంత్రి రూపానీకి చెందిన సంస్థ కపటపూరితంగా షేర్ల లావాదేవీలకు పాల్పడినందుకు షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ జరిమానా విధించిందని పేర్కొంటూ, మీ ముఖ్యమంత్రి నీతిబాహ్య చర్యపై మీరు పెదవి విప్పాలని ఆయన బనస్కంత జిల్లాలోని పలన్‌పూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడుతూ మోదీని డిమాండ్ చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాల కన్నా గుజరాత్‌లో అవినీతి ఎక్కువగా ఉందని పేర్కొంటూ బీజేపీ పాలనపై రాహుల్ ధ్వజమెత్తారు. సూరత్ వ్యాపారులు ప్రతి రెండు నిముషాలకు ఒకసారి పోలీసులు తమ యూనిట్ల వద్దకు వస్తుంటారని తనకు చెప్పారని రాహుల్ పేర్కొన్నారు. అంటే లంచాలు పుచ్చుకోవడానికే పోలీసులు అలా వస్తుంటారని ఆయన పరోక్షంగా పేర్కొంటూ, రాష్ట్రంలో అవినీతి తీవ్రతకు ఇది అద్దం పడుతోందని అన్నారు. ‘్భరతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా రూ. 50వేలు ఉన్న తన కంపెనీ టర్నోవర్‌ను 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రూ. 80 కోట్లకు పెంచుకున్నారు. అవినీతికి పాల్పడకుండా ఇది సాధ్యం కాజాలదనే విషయం గుజరాత్ ప్రజలకు తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మోదీజీ, కొద్ది రోజుల క్రితం సెబీ మీ ముఖ్యమంత్రిని నీతిబాహ్యుడిగా పేర్కొంది. జరిమానా విధించింది. ‘న ఖాఊంగా, న ఖానే దూంగా’ (నేనెప్పుడూ అవినీతికి పాల్పడను. ఎవరినీ అవినీతికి పాల్పడనివ్వను) అని మీరు ఎప్పుడూ చెబుతుంటారు. దయచేసి, ఇప్పుడు ఈ అంశంపై పెదవి విప్పండి’ అని రాహుల్ ప్రధానిని ఉద్దేశించి అన్నారు. ‘కాని, ఆయన (మోదీ) ఇప్పుడు వౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నినాదం ‘న బోల్తా హు, న బోల్నే దూంగా’ (నేను మాట్లాడను. ఎవరినీ మాట్లాడనివ్వను)’ అని రాహుల్ ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అమిత్ షా కుమారుడి కంపెనీపైనా, విజయ్ రూపానీ వ్యవహారంపైనా మీరు (మోదీ) మాట్లాడాలని దేశం ఎదురు చూస్తోంది. ఈ అంశాలపై మీరు పెదవి విప్పకపోతే మీరు చౌకీదార్ (వాచ్‌మన్) కాదని, ‘్భగీదార్’ (్భగస్వామి) అని గుజరాత్ ప్రజలు విశ్వసిస్తారు’ అని రాహుల్ అన్నారు. 2011 జనవరి- జూన్ మధ్య కాలంలో కంపెనీ షేర్ల లావాదేవీల్లో కపటపూరితంగా వ్యవహరించినందుకు సెబీ జరిమానా విధించిన 22 సంస్థల్లో విజయ్ రూపానీకి చెందిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) సంస్థ శరణ్ కెమికల్స్ లిమిటెడ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని గుజరాత్ పర్యటనలో ప్రస్తావించారు.

చిత్రం..గుజరాత్‌లోని బనస్కతలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ షోలో ఒక అభిమాని అందజేసిన తలపాగాను స్వీకరిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ